Sravana masam: ఖమ్మం: వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి ఇంట అష్ట ఐశ్వర్యాలు తులతూగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ శ్రావణ మాసం సకల శుభాలకు నాందీ పలకాలని కోరారు. ఖమ్మం పౌర సమితి, మహాత్మా గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం(Sravana masam సందర్భంగా ప్రియతమ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కు చెన్నై ఆర్ట్ గ్యాలరీలో ఆర్టిస్ట్ తో ప్రత్యేకంగా తయారు చేయించిన లక్ష్మీ అమ్మవారి ప్రతిమను బహుకరించారు. పౌరసమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ తో పాటు కార్యవర్గ సభ్యులు శనివారం మంత్రికి ఈ బహుకరణ అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ శ్రావణ మాసం మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన నెల అన్నారు. ఈ మాసంలో మహా దేవుడైన శివుడికి నిర్వహించే పూజలు యావత్తు జిల్లాకు సకల శుభాలను కలిగించాలని ఆకాంక్షించారు. పౌర సమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబం జిల్లా ప్రజల ఆశీస్సులతో మరింతగా వర్ధిల్లాలని కోరారు. మంత్రి అజయ్ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి మన్ననలు పొందుతున్నారని, భవిష్యత్ లో మరిన్ని రాజకీయ పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు.


పువ్వాడ కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని కోరారు. ఈ సందర్భంగా సీతారాముల ప్రతిమను కూడా మంత్రికి అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కొత్త వెంకటేశ్వరరావు, షేక్ ఖాసిం, కీసర పద్మజా రెడ్డి, గోళ్ళ రాధాకృష్ణమూర్తి, కోదుమూరు జగన్నాథం, గుమ్మడవెల్లి శ్రీనివాస్, మాశెట్టి వరప్రసాద్, శ్రీకళారెడ్డి, తన్నీరు శోభారాణి, నకిరికంటి సతీష్, బూర్లె లక్ష్మీ నారాయణ, పోలా హరినాద్ బాబు, గఫార్, బత్తుల బసవ పున్నయ్య, ప్రకాష్, ప్రసాద్ తదితర పుర ప్రముఖులు కార్యవర్గ సభ్యలు పాల్గొన్నారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?