Telangana Jobs Portal

Telangana Jobs Portal : స్థానిక యువ‌త‌కే ముందు..నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ భేష్‌!

Spread the love

Telangana Jobs Portal : ఉద్యోగాల‌పై వివ‌క్ష లేకుండా స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పాల‌న ప్ర‌యోజ‌నాల‌కే నూత‌న జిల్లాల ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ప్రైవేటు రంగంలో 15 ల‌క్ష‌లు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు.


Telangana Jobs Portal : హైదరాబాద్ : తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదించిన నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ‌, విద్య అవ‌కాశాల్లో సమాన వాటా ద‌క్కుతుంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ ఆమోదించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక నుంచి స్థానికుల‌కే ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని, ఎలాంటి వివ‌క్ష లేకుండా స‌మాన అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మ‌డి ఏపీలో ఉన్న జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన అనంత‌రం, నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ రూపుదిద్దుకుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేర‌కు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మ‌ల్టీ జోన్ల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌న్నారు. దీంతో దేశంలో ఎక్క‌డా లేని విధంగా అత్య‌ధికంగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కుతాయ‌న్నారు.

నూత‌న జిల్లాల ఏర్పాటు!

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు పాల‌న ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు వేగంగా తీసుకెళ్లేందుకు జిల్లాల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేశామ‌ని మంత్రి అన్నారు. దీంతో పాటు ఆయా జిల్లాల‌ను ప్ర‌త్యేక జోన్లుగా వ‌ర్గీక‌రించామ‌న్నారు. నూత‌నంగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయ‌ణ్‌పేట జిల్లాల‌ను ఆయా జోన్ల‌లో చేర్చి చ‌ట్ట‌బ‌ద్ధం చేయ‌డంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ఆ జిల్లాల‌ను చార్మినార్ జోన్ ప‌రిధిలోకి తేవ‌డం ప‌ట్ల ఆయా జిల్లాల ప్ర‌జ‌ల త‌ర‌పున ముఖ్య‌మంత్రికి, ప్ర‌భుత్వానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్ప‌టికే త‌మ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖ‌ల ద్వారా ఒక ల‌క్షా 33,000 వేల పైచిలుకు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను రాష్ట్ర యువ‌త‌కి అందించామ‌ని కేటీఆర్ తెలిపారు.

టీఎస్ ఐపాస్ విధానం!

కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌నే కాకుండా గ‌త ఏడేళ్ల‌లో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు, వేల ప‌రిశ్ర‌మ‌లు రాష్ట్రం ఆక‌ర్షించింద‌ని అన్నారు. త‌ద్వారా సుమారు 15 ల‌క్ష‌ల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వ‌చ్చాయ‌న్నారు. ఒక వైపు ప్ర‌భుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికుల‌కే అవ‌కాశాలు ద‌క్కేలా నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం, ప్రైవేట్ కంపెనీల్లో ఇక్క‌డ యువ‌తకు మ‌రిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు ఇచ్చేలా మ‌రో విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. అటు ప్ర‌భుత్వ‌, ఇటు ప్రైవేటు రంగాల్లో స్థానిక యువ‌త‌కు అత్య‌ధిక ఉపాధి అవ‌కాశాలు దొరికేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు, యువ‌త ప‌క్షాన కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

KTR to become Chief Minister of Telangana | కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే కేబినెట్‌ మారుస్తారా?

Hyderabad‌: తెలంగాణ రాష్ట్ర సీఎం గా మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (KTR‌) వ‌చ్చే నెల‌లో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కోడై కూస్తున్న Read more

Police officers suspended: భార్య భ‌ర్త‌ల కేసులో చిక్క‌డ‌ప‌ల్లి సీఐ, అశోక్‌న‌గ‌ర్ ఎసై స‌స్పెన్ష‌న్‌?

Police officers suspended హైద‌రాబాద్: చిక్క‌డ‌ప‌ల్లి సీఐ పాల‌డుగు శివ‌శంక‌ర్‌రావు, అశోక్‌న‌గ‌ర్ సెక్టార్ ఎస్సై పి.న‌ర్సింగ‌రావు స‌స్పెండ్ అయ్యారు. న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ వీరిని Read more

RS Praveen Kumar: నెల‌లో ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ రాజ‌కీయ ప్ర‌యాణం ఎలా ఉందంటే?

RS Praveen Kumar: మాజీ ఐపిఎస్ అధికారి ప్ర‌స్తుతం బిఎస్పీ నేత ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి బుధ‌వారానికి నెల పూర్త‌య్యింది. ఈ Read more

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : 'ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే Read more

Leave a Comment

Your email address will not be published.