Dalit Bandhu Scheme: జమ్మికుంట: ఎస్సీలలో సమూల మార్పు తెచ్చే దళిత బంధు పథకం దేశంలో మరొకటి లేదని, కేసీఆర్ అమలు చేస్తున్న మరో సాహసోపేతమైన పథకమిదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇటువంటి పథకాలు ప్రజల డిమాండ్ మేరకు కేంద్రం, రాష్ట్రాలలో కూడా రావచ్చని తెలిపారు. సర్వే పనుల్లో మరింత శ్రద్ధ చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
జమ్మికుంట పట్టణంలోని మంగళవారం మసీదు గల్లీలో దళిత మహిళతో పాటు మంత్రి ఈశ్వర్ నేలపై కూర్చొని దళితబంధు పథకం(Dalit Bandhu Scheme) గొప్పతనాన్ని వివరించారు. ఆనాదిగా నిరాదరణకు గురైన ఎస్సీల సమున్నతికి ఒక మంచి పథకం తేవాలని కేసీఆర్ రెండు మూడేళ్లు గా అనుకుంటూ ఉన్నారని అన్నారు. అనుకున్నతడువుగానే ఈ పథకంకు రూపకల్పన చేశారన్నారు.
ఇది కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని, దీనిని రైతు బంధు మాదిరిగా తప్పక అమలు చేసి తీరుతారన్నారు. ఈ పథకాన్ని మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ సుమారు 21 వేల కుటుంబాలకు 10 లక్షల చొప్పున అందిస్తామన్నారు. దీనికి సంబంధించిన సర్వే పనులను మరింత శ్రద్ధతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పథకాన్ని రాష్ట్ర మంతటా అమలు చేయాలనే ధృఢ సంకల్పంతో కేసీఆర్ ఉన్నారని, ఇందుకు రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చవుతాయని మంత్రి వివరించారు. ఈ మహదవకాశాన్ని ఏ విధగా సద్వినియోగం చేసుకోవాలే ఆలోచన చేయాలని సూచించారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?