Minister Kodali Nani Fire on Chandrababu Naidu Latest News | The Rule of CM Jagan | చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని
Minister Kodali Nani Fire on Chandrababu Naidu Latest News | The Rule of CM Jagan | చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని Gudivada: మంత్రి కొడాలి నాని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, అసలు మనిషే కాదు అని వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో బుధవారం మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 74 సంవత్సరాలు వచ్చి, ఇంత రాజకీయ అనుభవం ఉండి మతా లు, కులాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అని ఆరోపించారు. సీఎం, హోం మంత్రి, డిజిపి, ఎస్పీ క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు మాట్లాడటం దారుణమని మంత్రి కొడాలి నాని అన్నారు. అధికారులు మతాల వారీగా పనిచేయరని, అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు.
చంద్రబాబు లాంటి నీచుల కోసమే అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతలు తీసుకునేటప్పుడు కుల, మత, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని పెద్దలు ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. రాష్ట్రంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం, అన్ని వర్గాలను ఆదరించబట్టే చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో ఉన్నాడనేది గుర్తుంచు కోవాలని మంత్రి కొడాలి నాని అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉచ్చం, నీచం లేకుండా రాష్ట్రంలో మతాల, కులాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీచ రాజకీ యాలను ప్రజలు గమనిస్తున్నారని ఎప్పటికైనా ఆ రాజకీయాలను భూస్థాపితం చేస్తారని నాని అన్నారు. జగన్ గురించి మిడత లాంటి లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని హెద్దేవా చేశారు.
జగన్ ఓ శక్తి ..ఓ వ్యవస్థ: మంత్రి కొడాలి నాని
జగన ఓ శక్తి ..ఓ వ్యవస్థ అని ఎంత మంది వచ్చి ఢీకొట్టినా పళ్లు రాలిపోతాయని మంత్రి కొడాలి నాని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి అని, ఎవ్వరీ భయపడే వాడు కాదని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి మారు మూల పల్లెలో ఉన్న వారందరికీ తెలుసు అని, ఇచ్చిన మాట కోసం ఎంత వరకు అయినా వెళ్లే గొప్ప వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తమని ఏమీ చేయలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే పది మాటలు అంటానని మంత్రి కొడాలి నాని అన్నారు.
విద్వేషాలు రగల్చాలని చూస్తున్నారు: మంత్రి
చంద్రబాబు నాయుడు హిందువులను అడ్డం పెట్టుకొని వారి మతాలపై విద్వేషం రగిల్చి రాష్ట్రంలో దాడులకు దిగుతున్నారని అన్నారు. ఎన్టిఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడును పార్టీలో నుండి పంపించి వేయాలని, త్వరలో ప్రజలు కూడా రాజకీయాల నుంచి పంపించి వేస్తారని ఆరోపించారు. తండ్రి ముఖ్యమంత్రై, తాత ముఖ్యమంత్రై దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ సిఎం జగన్‌ను అనే స్థాయి లేదని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని కొడాలి నాని అన్నారు.రాష్ట్రంలో ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తన కులంలో పెద్దవారందరికీ స్థలాలు కొనిచ్చి వారిని మాత్రమే అభివృద్ధి చేయాలనే దుర్భద్ది ఉన్నవారని పేర్కొన్నారు.
ఇది చదవండి : తెలుగు రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ భయం! | చికెన్ ధరలపై ప్రభావం!
ఇది చదవండి : తోటి సిబ్బంది పట్ల ప్రేమను చాటుకున్న సోనూసూద్