Minister Harish Rao: హైదరాబాద్ : దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీశ్‌రావు మంగళవారం స్పందించారు. టిఆర్ఎస్ కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి బాధ్యత స్వయంగా తానే వహిస్తున్నానని, ఓడిపోవడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని అన్నారు. దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతామని చెప్పారు. ఓడిపోయినప్పటికీ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని Minister Harish Rao అన్నారు. దుబ్బాక తీర్పును మంత్రి కేటిఆర్ కూడా అంగీకరించారు. తాము అనుకున్నట్టు ఫలితాలు రాలేదని, ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి భవిష్యత్తులో ముందుకు పోతామని ఆయన స్పష్టం చేశారు.
మరో వైపు దుబ్బాక లో పోలింగ్ అనేక వాదోపవాదాలు, రాజకీయ ఘర్షణల నడుమ జరిగింది. మొత్తంగా ఓట్ల లెక్కింపు లో బీజేపీ, టిఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య విజయం చివరి వరకు సందిగ్థంలో పడేసింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ చివరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలో ఓట్లను లెక్కించగా, మొదటి ఐదు రౌండ్లతో పాటు 8.9,11,20,22, 23 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిం చింది. 6,7,10,13,14,15,16,17,18,19 రౌండ్లలో అధికార టిఆర్ఎస్ హవా కొనసాగింది. 12వ రౌండ్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. మొత్తం 23 రౌండ్లు. బీజేపీ 12 రౌండ్లలో ఆధిక్యం కనబరిచింది. టిఆర్ఎస్ 10 రౌండ్లలో గెలిచింది. ఒక రౌండ్లో కాంగ్రెస్ ముందుంది.
బీజేపీ , టిఆర్ఎస్ మధ్య స్వల్ప ఆధిక్యమే ఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై చివరి వరకు స్పష్టత రాలేదు. 23వ రౌండ్లో బీజేపీ 412 ఓట్లు ఆధిక్యం సాధించడంతో అప్పటికే 1058 మెజార్టీతో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.
పొంగిపోం..కుంగిపోం : KTR


విజయాలకు గర్వపడమని, అపజయాలకు కుంగిపోమని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొంఇన తర్వాత హైదరబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడరు. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులను, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాకలో ఫలితం తాము ఆశించినట్లుగా రాలేదని, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్తులో ముందుకు పోతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యమన్నారు. దుబ్బాక ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసిందన్నారు. ‘భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం మా పని మేం చేసుకుంటూ ముందుకెళ్తాం.’ అని కెటీఆర్ పేర్కొన్నారు.