Mini Taj mahal: మొగల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ 1632 లో మరణించినప్పుడు ఆమె మీద ప్రేమతో ఓ జ్ఞాపకం కట్టాడు. అదే ఆగ్రాలోని తాజమహల్. ప్రేమనేది చక్రవర్తులకే కాదండోయ్.. మనలాంటి సామన్యులది కూడా ప్రేమే. కాకపోతే మనం అంతలా ప్రేమను వ్యక్తీకరించలేము. కానీ మనలోనే కొందరు సామాన్యులు మాత్రం తమ భార్య లేదా ప్రియురాలి మీద ప్రేమని వివిధ పద్ధతుల్లో వ్యక్తీకరించారు చరిత్రలో.
అలాంటి సామాన్యుల ప్రేమికుల్లో ఫైజుల్ హసన్ ఖాద్రీ (Faizul Hasan Qadri) ఒకరు. ఇతను ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహర్ జిల్లాకు చెందిన ఫైజుల్ కి, తాజ్ములీతో 1953లో వివాహమైంది. వీళ్లకి పిల్లలు లేరు. ఓ సారి ఇతను భార్యతో తమ గ్రామం నుంచి ఆగ్రాకి వెళ్లి తాజమహల్ని చూశాడు. అక్కడ తన భార్య మరణాంతరం ఎవరైనా తమని అసలు గుర్తంచుకుంటారా? అని అడిగింది. అందుకు నువ్వు ముందు చనిపోతే నేను నిన్ను గుర్తుంచుకునేలా చేస్తానని (Mini Taj mahal) మాట ఇచ్చాడు.
తాజ్ములీ తన 14వ యేటనే ఫైజుల్ను వివాహం చేసుకుంది. ఎంతో మృదువుగా మాట్లాడే ఆమెను అతను చాలా ఇష్టపడేవాడు. చదువు రాని ఆమెకి ఖాద్రీ ఉర్ధూ భాషని నేర్పించాడు. 58 సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి జీవించారు. విధి ఆడిన నాటకంలో దురదృష్టవశాత్తు ఆమెకి గొంతు కేన్సర్ వచ్చింది. డాక్టర్లు దాన్ని గుర్తించలేక పోయారు. నగరంలో పెద్ద డాక్టర్ల దగ్గరకు పోతే అప్పటికే ఆలస్యమైందని చెప్పారు. సరిగ్గా 2011 డిసెంబర్లో తాజ్ములీ బేగం కేన్సర్‌తో మృతి చెందింది.
Mini Taj mahal : భార్యకు ఇచ్చిన మాట ప్రకారం
తాజ్ములీ మరణించిన తర్వాత తనకు ఇచ్చిన ప్రకారం ఆమె జ్ఞాపకార్థం ఖాద్రీ తన ప్రేమని ప్రదర్శించాడు. ఎలాగైనా తాజ్‌మహల్ మోడల్లోనే నిర్మించాలనుకున్నాడు. తాజ్‌మహల్‌కి డూప్లికేట్ నిర్మించాడు. దీని పేరు అక్కడ అస్గర్ అని పిలుస్తారు. తాజ్‌మహల్ నిర్మాణానికి మూడేళ్లు కష్టపడి ఫైజుల్ హాసన్ తన గ్రామమైన కాసర్ కలన్లోనిర్మించారు. తన పొలం, భార్య బంగారు నగలు, ఇంట్లో వెండి అమ్మగా వచ్చిన డబ్బుతో దీన్ని నిర్మించాడు.
పొలాన్ని అమ్మగా 6 లక్షలకి, భార్య బంగారం అమ్మగా రూ.లక్షన్నర తో దీన్ని ఆరంభించాడు. మొత్తంగా 11 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. Taj Mahal కు నలు వైపులా గల మినార్ల ఎత్తు సుమారు 25 అడుగులు ఉంటుంది. చుట్టూ చెట్లు నాటి భవంతి ముందు చిన్న సరస్సుని కూడా ఏర్పాటు చేశాడు. పోస్టుమాస్టర్‌గా పని చేసి రిటైర్డైన ఖాద్రీ తన పెన్షన్ మొత్తాన్ని మాత్రం ఉంచుకుని మిగిలినదంతా ఈ స్మారక నిర్మాణానికే వెచ్చించాడు.

సీఎం ఇస్తానన్న వద్దన్నాడు!
అప్పట్లో ఒకసారి ఉత్తర్ ప్రదేవ్ ముఖ్యమంత్రి Akhilesh Yadav ఈయన్ని లక్నోకి పిలిపించి ధన సహాయం చేస్తానని చెప్తే మర్యాదగా తిరస్కరించాడట. మా గ్రామంలోని స్కూల్‌ని ఎడ్యుకేషన్ బోర్డు గుర్తిస్తే నాకు అదే పదివేలు అని ఆయన్ని కోరాట. తన మరణాంతరం తనని కూడా అందులోని Tajmulli సమాధి పక్కనే సమాధి చేయమని ఖాద్రీ తన సోదరుడ్ని కోరాడట. ప్రస్తుతం ఈ తాజ్ మహల్ (Mini Taj mahal) ని కొందరు సందర్శిం స్తున్నారు. కొందరు విదేశస్తులు కూడా దీని గురించి తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారట. నిజంగా తన భార్యపై అంత ప్రేమను చూపిన ఆ పెద్దాయన మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది.