Milan Rehearsals 2022 | విశాఖ తీరాన నగరంలో జరుగుతున్న ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మిలన్ 2022 సందర్భంగా నిర్వహిస్తోన్న సన్నాహక విన్యాసాలు ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. మిలన్ విన్యాసాలను తిలకించేందుకు వేలాదిగా ప్రేక్షకులు తీరానికి చేరకున్నారు. ఫిబ్రవరి 24 నుంచి సన్నాహక విన్యాసాలు జరుగుతున్నాయి. ఫైనల్ సన్నాహక విన్యాసాలు ఫిబ్రవరి 26న జరిగాయి. ప్రధాన విన్యాసాలు ఫిబ్రవరి 27న జరుగుతాయి అని నౌకా దళ అధికారులు(Milan Rehearsals 2022) చెబుతున్నారు.
మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ నెల 30 వరకు జరుగుతాయని అధికారులు అంటున్నారు. ఇందులో భాగముగా నౌక విన్యాసాలు, విమాన హెలికాఫ్టర్ విన్యాసాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6.30 కు ఇతర దేశాల నుంచి వచ్చిన నౌక దళ సిబ్బంది, స్థానిక కళాకారులతో పరేడ్ నిర్వహించారు. ఇందులో ఎన్సీసీ, కోస్ట్ గార్డ్, స్పెషల్ ఫోర్స్, ఇండియన్ నేవీ వెటరన్స్, ఇండియన్ నేవీ బ్యాండ్ ట్రూప్, యెన్ యస్ జి గార్డ్స్, ఇండియన్ నేవీ మార్చ్ ఫాస్ట్ గ్రూప్, ఏపీ పోలీసు బ్యాండ్ ట్రూప్, ఏపీ పోలీసు మార్చ్ ఫాస్ట్ గ్రూప్, కోరుకొండ సైనిక్ స్కూలు మార్చా ఫాస్ట్ ప్లాటూన్, బ్యాండ్ ప్లాటూన్, తో పాటు..

మలేషియా నౌకా దళ ప్లాటూన్, మయన్మార్ నౌక దళ ప్లాటూన్, సి సెల్స్ నౌక దళ ప్లాటూన్, అమెరికా నౌకా దళ ప్లాటూన్, ఇంకా ఇతర దేశాల నౌక దళాల ప్లాటూన్ సిబ్బందితో పాటు స్థానిక గరక నృత్య కళాకారులు, థింసా నృత్య కళాకారులు, కూచిపూడి కళాకారులు, తప్పెడ గుళ్లు కళాకారులు, తమ యొక్క కళా రూపాలను ప్రదర్శిస్తూ పరేడ్‌లో పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. విశాఖ స్మార్ట్ సిటీ శకం, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న నవరత్నా సంక్షేమ పథకాల శకటం, పచ్ హత్తర్ సాల్ అజాది క అమృత్ మహోత్సవ శకడం పరేడ్‌లో పాల్గొననున్నాయి.

మిలన్ విన్యాసాల సందర్భంగా పోలీసులు బీచ్ రోడ్డు మరియు విశాఖ నగరంలోని ఇతర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మిలన్ సందర్భంగా సముద్రంలో ఉన్న భారత నౌకా దళానికి చెందిన నౌకలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మిలన్ నిర్వహిస్తోన్న విన్యాసాలు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని బీచ్‌కు వచ్చే సందర్భకులు చెబుతున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!