Milan 2022 in Vizag: మహా నగరమైన విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ విన్యాసాలకు వేదికైంది. 2016 సంవత్సరంలో అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ నిర్వహించి సత్తా చాటిన మహానగరం విశాఖ. నాలుగు రోజుల కిందట ఫ్లీట్ రివ్యూని ఘనంగా నిర్వహించింది. అయితే ప్రతిష్టాత్మకమైన మిలన్-2022 అంతర్జాయతీ విన్యాసాలకు రెడీ అయ్యింది. నౌక దళ విభాగంలో కీలకమైన మిలన్ కోసం ఇండియన్ నేవీ 46 దేశాలను ఆహ్వా నించాయి. 39 దేశాలు మాత్రం పాల్గొంటాయి. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు పలు దేశాల నౌకా దళాలు తమ ప్రతిభా పాటవాలను (Milan 2022 in Vizag)ప్రదర్శించనున్నాయి.
నగరంలో ఈ నెల 27న బీచ్ రోడ్డులో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మిలన్ విన్యాసాలు 1995లో తొలుత ప్రారంభమయ్యాయి. ఈ తొలిసారి విన్యాసాల్లో మన దేశం(భారత్)తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలకం, థాయ్‌లాండ్ వరికే పాల్గొన్నాయి. 2005లో వచ్చిన సునామీ కారణంగా మిలన్‌ను రద్దు చేశారు. 2001 మరియు 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కారణంగా మిలన్ విన్యాసాలు జరగలేదు.

2010 సంవత్సరం వరకు 8 దేశాలు పాల్గొన్నాయి. ఆ తర్వాత 2012 సంవత్సరంలో ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014, 2018 సంవత్సరంలో 17 దేశాలు పాల్గొన్నాయి. 10 సార్లు జరిగిన తర్వాత ఇప్పుడు 11వ మిలన్ విన్యాసాలకు విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. మిలన్ -2022 లో జరిగే విన్యాసాలకు 39 దేశాలు పాల్గొననున్నాయి.
విశాఖ తీరానికి చేరుకున్న నౌకలు
మిలన్ 2022లో పాల్గొనేందుకు విశాఖపట్నం తీరానికి 10 దేశాలకు చెందిన నౌక అధికారులు, యుద్ధ నౌకలు చేరుకున్నాయి. శుక్రవారం మిగిలిన దేశాలు నౌకలు చేరుకోనున్నాయి. రెండు దశల్లో జరిగే ఈ విన్యాసాలు 25 నుంచి 28 వరకు హార్బర్ ఫేజ్‌లో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు సీఫేజ్ విన్యాసాలు జరగనున్నాయి. 26వ తేదీన మిలన్ మిలేజ్ ప్రారంభం అవ్వనుంది. 27న బీచ్ రోడ్డులో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు జరగనున్నాయి. 28వ తేదీన సముద్ర జలాల వినియోగం, భద్రతలో సామూహిక సహకారం అనే పలు అంశాలపై ఆయా దేశాల ప్రతినిధులు మాట్లాడనున్నారు.

అణవణువూ నిఘా!
మిలన్ విన్యాసాలు సజావుగా సాగేందుకు ఏపీ ప్రభుత్వం పటిష్టంగా ఏర్పాటు చేసింది. సిటీ పరేడ్‌తో పాటు జరిగే విన్యాసాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పర్యవేక్షణలో ఉండనుంది. విన్యాసాలు జరిగే ప్రదేశాల్లో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి తీవ్రవాద నిరోధక దళాలతో పాటు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్, మార్కోస్ వంటి కేంద్ర భద్రతా దళాలతో కూడిన 3 వేల మంది ఆర్మీ సైనికులను నగరంలో మోహరించారు. బీచ్ రోడ్డులోని ఈవెంట్ ప్రాంతంలో ప్రజలను అనుమతించడానికి దాదాపు 16 మార్గాలను ఖరారు చేశారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ