Migraine

Migraine: భ‌రించ‌లేని మైగ్రేన్ త‌ల‌నొప్పి వ‌స్తుందా?

Share link

Migraine | త‌ర‌చుగా త‌ల‌నొప్పి వ‌స్తే అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ర‌క్త‌పోటు, మెద‌డులో క‌ణితులు, ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌లో మార్పులు, మాన‌సిక ఒత్తిడి, నిద్ర‌లేమి వ‌ల్ల headache వ‌చ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ స్త్రీల‌లో అధికంగా క‌నిపిస్తుంది. నొప్పి చాలా వ‌ర‌కు త‌ల‌కు ఓ ప‌క్క భాగంలో ఉంటుంది. మైగ్రేన్ రావ‌డానికి కార‌ణాలు త‌ల‌లో ర‌క్త నాళాలు ఒత్తిడికి లోనై వాయ‌డం.

Migraine త‌ల‌నొప్పికి కార‌ణాలు

పార్శ్వ‌పు త‌లనొప్పి ముఖ్య‌కార‌ణం మాన‌సిక ఆందోళ‌న‌, మాన‌సిక ఒత్తిడి, కొంత మందికి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు, సూర్య‌ర‌శ్మి ద్వారా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అధికంగా ప్ర‌యాణాలు చేయ‌డం వ‌ల్ల కూడా వ‌స్తుంది. స్త్రీల‌లో హార్మోన్ల స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్పుడు, రుచుచ‌క్రం ముందుగా గానీ, త‌రువాత గానీ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యం రుచుచ‌క్రం ఆగిపోయిన‌ప్పుడు ఈ స‌మ‌స్య తీవ్రంగా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఓర‌ల్ కాంట్ర‌సెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని ర‌కాల మందులు వాడ‌టం వ‌ల్ల ఎక్కువుగా వ‌స్తుంది.

Migraine ల‌క్ష‌ణాలు

చాలా వ‌ర‌కు మైగ్రేన్ దానంత‌టే త‌గ్గిపోతుంది. సాధార‌ణంగా 24 గంట‌ల నుంచి 72 గంట‌ల కూడా ప‌ట్ట‌వ‌చ్చు. ఒక వేళ నొప్పి 72 గంట‌లు ఉంటే స్టేట‌స్ మైగ్రేన్ అంటారు. Migraine నొప్పి 4 ద‌శ‌ల‌లో సాగుతుంది. పోడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంట‌ల నుంచి 2 రోజుల ముందు వ‌ర‌కు జ‌రిగే ప్ర‌క్రియ‌ల స‌మూహం. ఈ ద‌శ‌లో చిరాకు, మాన‌సిక ఆందోళ‌న‌, డిప్రేష‌న్‌, ఆలోచ‌న‌లో మార్పులు రావ‌డం, వాస‌న‌, వెలుతురు ప‌డ‌క‌పోవ‌డం, మెడ‌నొప్పి ఉంటాయి. అరాఫేజ్: ఈ ద‌శ నొప్పి మొద‌ల‌య్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మంద‌గించిన‌ట్టుండ‌టం, జిగ్‌జాగ్ లైన్స్ రావ‌డం, త‌ల‌లో సూదుల‌తో గుచ్చిన‌ట్టు ఉండ‌టం, మాట‌లు త‌గ‌బ‌డ‌టం, కాళ్ల‌లో నీర‌సం ఉంటాయి

నొప్పి ద‌శ

ఈ నొప్పి ద‌శ 2 గంట‌ల నుంచి 3 రోజుల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. ఈ ద‌శ‌లో వాంతులు ఉంటాయి. పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి త‌గ్గిన త‌ర్వాత కొద్ది రోజుల వ‌ర‌కు త‌ల భారంగా ఉండ‌టం, నీర‌సంగా ఉండ‌టం, శ్ర‌ద్ధ లేకుండా ఉండ‌టం జ‌రుగుతుంది. ర‌క్త ప‌రీక్ష‌లు, ర‌క్త‌పోటును గ‌మ‌నించ‌డం, ఈఈజీ ప‌రీక్ష‌, సిటీ స్కాన్‌, ఎంఆర్ఐ మెద‌డు ప‌రీక్ష‌లు ద్వారా తెలుసుకోవ‌చ్చు.

Migraine రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

మానసిక ఆందోళ‌న‌లు త‌గ్గించుకోవాలి. మాన‌సిక ఒత్తిడి త‌గ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. త‌ల‌కు నూనెతో మ‌సాజ్ చేసుకోవాలి. త‌ల‌లోని న‌రాలు రిలాక్స్ అవుతాయి. త‌ల‌నొప్పి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో లైటు తీసేసి, నిశ్శ‌బ్ధంగా ఉన్న చోట ప‌డుకోబెట్టాలి.

headache త‌గ్గేందుకు Tips

ఎర్ర ఉల్లిగ‌డ్డ‌ని న‌లిపి శ్వాసిస్తే తలనొప్పి త‌గ్గుతుంది. ఉల్లిగ‌డ్డ‌ను స‌గంగా కోసి నెత్తి మీద వ్రాస్తే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. అల్లం జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్ని దూరం చేయ‌డంలో బాగా ప‌నిచేస్తుంద‌నే విష‌యం తెలిసిందే. అదే అల్లం త‌ల‌నొప్పిని కూడా త‌గ్గిస్తుంది తెలుసా. తాజా అల్లం ముక్క తీసుకుని న‌లిపి నీళ్ల‌లో వేసి ఉడికించాలి. ఈ నీళ్ల‌ను వ‌డ‌క‌ట్టి గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడే తాగాలి. ఈ నీళ్ల‌ను తాగిన కాసేప‌టికి త‌ల‌నొప్పి తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌డుతుంది. చాలాసార్లు త‌ల‌నొప్పి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లున్న‌ప్పుడే వ‌స్తుంది. కాబ‌ట్టి ఈ చిట్కా బాగా ప‌నిచేస్తుంది.

Talanoppi Chitkalu: త‌ల‌నొప్పిని ఇలా త‌గ్గించుకోండి చిటికెలో!

Talanoppi Chitkalu | అతి సాధార‌ణ‌మైన స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి. ఆ స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు ఏదో ఒక మాత్ర వేసుకుంటాం కానీ, దానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. Read more

what Migraine Headache: మైగ్రేన్ త‌ల‌నొప్పి అంటే ఏమిటి? ఎందువ‌ల్ల వ‌స్తుంది?

what Migraine Headache: మైగ్రేన్ వ‌ల్ల భరించ‌లేని నొప్పి వ‌స్తుంది. మైగ్రేన్ రావ‌డానికి ఒత్తిడీ, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి అనేక కార‌ణాలున్నాయి. మైగ్రేన్‌ని పూర్తిగా తొల‌గించుకోలేక‌పోవ‌చ్చు. కానీ Read more

Remove Whiteheads: ముక్కు చుట్టూ స‌మ‌స్య వైట్‌హెడ్స్‌ను ఇలా తొల‌గించుకోండి!

Remove Whiteheads: కొంద‌రికి Blockహెడ్స్ స‌మ‌స్య ఉంటే, మ‌రికొంద‌రిని Whiteheads స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది. చ‌ర్మంపై చాలా చిన్న‌గా తెల్ల‌ని మ‌చ్చ‌ల్లా క‌నిపిస్తుంటాయి. ఇవి సాధార‌ణంగా అందరి Read more

hemoglobin food: హిమోగ్లోబిన్ పెర‌గాలంటే ఏం చేయాలి!

hemoglobin food | ర‌క్తంలో హిమోగ్లోబిన్ త‌క్కువుగా ఉండ‌టం అనేది ముఖ్యంగా మూడు ర‌కాల కార‌ణాల వ‌ల్ల కావ‌చ్చు. శరీరంలో త‌గిన‌న్ని ఎర్ర ర‌క్త‌క‌ణాలు ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం, Read more

Leave a Comment

Your email address will not be published.