MG New Electric car హైదరాబాద్: ప్రముఖ Passenger వాహన శ్రేణి ఆటోమొబైల్ సంస్థ Morris Garages(MG) రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం హైదరాబాద్‌లో (MG New Electric car)ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని, ఆ దిశగా అన్ని చర్యలు చేపట్టిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకుంటున్నాయని, వివిధ ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే ప్రక్రియలో ఉన్నాయన్నారు.
తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను రిజిస్ట్రేషన్ ఫీజును, రోడ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడం ఇందుకు ప్రధాన కారణమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,568 ఈవీలు అమ్ముడయ్యాయని, వీటిలో 3,572 ద్విచక్రవాహనాలు ఉన్నాయని తెలిపారు.


ఇప్పటికే వీటన్నిటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు.
ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో అడుగుపెట్టిన ఎంజీ సంస్థను సిబ్బందికి మంత్రి పువ్వాడ అజయ్ అభినందనలు తెలిపారు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!