Temperature : ఈ రెండ్రోజులు మండే అగ్నిగోళ‌మే! | Sun Effect

0
82

Temperature : ఈ రెండ్రోజులు మండే అగ్నిగోళ‌మే! | Sun Effect

Temperature :ఆగ్నేయ బంగాళాఖాతం, ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో ప‌లు మార్పులు జ‌రుగుతున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) ప్ర‌క‌టించింది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్టోగ్ర‌త‌లు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో ఉష్టోగ్ర‌త‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధార‌ణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువుగా న‌మోద‌వుతున్నాయి.

ఇదే స‌మ‌యంలో వ‌డ‌గాడ్పులు, ఉక్క‌పోత పెర‌గ‌డంలో జ‌నం విల‌విల్లాడుతున్నారు. బుధ‌వారం భ‌ద్రాచ‌లంలో రాష్ట్రంలోనే అధికంగా 42.4 డిగ్రీల గ‌రిష్ట ఉష్టోగ్ర‌త న‌మోదైంద‌ని, ప్ర‌స్తుత సీజ‌న్లో ఇదే అత్య‌ధిక‌మ‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో 38.5 డిగ్రీల సెల్సియ‌స్ న‌మోదు కాగా, ఇప్పుడు ఏకంగా 3.9 డిగ్రీలు ఎక్కువుగా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

మండుతున్న ఎండ‌లు, వ‌డ‌గాల్పుల ప్ర‌భావం నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఎండ‌లో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే వారు వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. వ‌డ‌దెబ్బ త‌గిలిన వారికి త‌క్ష‌ణ‌మే చికిత్స అందించాల‌ని చ‌ల్ల‌టి గాలి త‌గిలే ప్ర‌దేశంలో ఉంచి విశ్రాంతి ఇవ్వాల‌ని సూచించింది. ఉప్పు, పంచ‌దార క‌లిపిన చ‌ల్ల‌టి నీళ్ల‌ను తాగించాల‌ని, వైద్యుల ద‌గ్గ‌రికి తీసుకెళ్లాల‌ని పేర్కొంది.

ఎండ‌ల తీవ్ర‌త‌ను త‌ట్టుకొనేందుకు నూలు దుస్తులు ధ‌రించ‌డం, క‌ళ్ల‌జోడు పెట్టుకోవ‌డం, బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు గొడుగుని ఉప‌యోగించ‌డం, చ‌ర్మానికి స‌న్‌స్క్రీన్ లోష‌న్ రాసుకోవ‌డం వంటివి చేయాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూర‌లు, పండ్లు, ద్ర‌వ ప‌దార్థాలు ఎక్కువుగా ఉండేలా చూసుకోవాల‌ని చెబుతున్నారు.

వేస‌వి కాలం హెల్తీ టీ ఎంతో బెస్ట్‌!

ఈ వేస‌వి కాలం భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొద‌టి వారంలోనే మే నెల‌లో వ‌చ్చేంద ఎండ‌లు వ‌స్తున్నాయి. ఇంత ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. బ‌య‌ట ఉద్యోగాలు, వ్యాపారాలు చేయ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లేవారు ఈ వేడిగాల‌లుకు అనారోగ్యం పాల‌వుతుంటారు. ఇక ప్ర‌స్తుతం వీటికి తోడు క‌రోనా వైర‌స్ ఒకింత భ‌యాందోళ‌న క‌లిగిస్తోంద‌నేది తెలిసిందే. ఈ స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకోవ‌డం అత్యంత ముఖ్యం.

ఈ వేస‌వి కాలంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం పండ్లు, కూరగాయ‌లు, నీరు ఎక్కువుగా తీసుకుంటూ ఉండాలి. ఇక ఎండాకాలం అన‌గానే చాలా మంది టీ తాగ‌డం మానేస్తుంటారు. అలాంటి వారికి వేడిని త‌గ్గించుకోవ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఈ డీటాక్స్ టీ తీసుకోవ‌డం ఎంతో లాభం అని నిపుణులు అంటున్నారు. ఈ టీ తో శ‌రీర బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు దీనిని తీసుకోక‌పోవ‌డం మంచిద‌ని నిపుణులు ఆయుర్వేద డాక్ట‌ర్లు చెబుతున్నారు. డిటాక్స్ పానీయాలు జీర్ణ‌క్రియ లేదా వేడిని త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఇవి శ‌రీరంపై ఉండే అవాంచిత‌, పేరుకుపోయిన విష ర‌సాయనాల‌ను వ‌దిలించుకోవ‌డానికి స‌హాయ ప‌డ‌తాయి. రోగ నిరోధ‌క శ‌క్తినిపెంపొందించ‌డ‌మే కాకుండా మాన‌సిక ఉత్సాహాన్ని పెంచుతాయి. ఈ వేస‌వికాలంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేందుకు ఈ అగ్ని టీ స‌హాయ‌ప‌డుతుంద‌ని ఆయ‌ర్వేద డాక్ట‌ర్ వ‌సంత్ తె‌లిపారు.

అగ్ని టీ త‌యారుకు కావాల్సిన ప‌దార్థాలు!

నీరు – లీట‌ర్‌
కార‌పు మిరియాలు – చిటికెడు
అల్లం – స‌గం ముక్క‌
రాక్ ఉప్పు – ఒక టీ స్పూన్‌
బెల్లం – రెండు టేబుల్ స్పూన్లు
మాపుల్ సిర‌ప్‌, నిమ్మ‌రసం

Latest Post  raw coconut water: summer drink కొబ్బ‌రి నీళ్లు కాక‌పోతే మ‌రేమిటి?

త‌యారీ విధానం..!

ముందుగా నిమ్మ‌రసం మిన‌హా.. పైన తెలిపిన అన్ని ప‌దార్థాల‌ను ఒక బాణ‌లిలో వేసి దాదాపు 20 నిమిషాలు ఉడ‌క‌బెట్టాలి. కొన్ని నిమిషాలు చ‌ల్ల‌బ‌ర‌చాలి. చ‌ల్లారిన త‌ర్వాత కొంచెం నిమ్మ‌ర‌సం పిండి, ఆ ర‌సాన్ని వ‌డ‌క‌ట్టి గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తాగాలి. ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు మీ శ‌రీరాన్ని డీహైడ్రేట్ కాకుండా స‌హాయ‌ప‌డుతుంది. దీనిని రోజుకు రెండు సార్లు మాత్ర‌మే తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here