Memory loss: కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి ఇప్పుడు కొత్త ఆరోగ్య సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్ సోకిన వారు ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకొని పూర్తి ఆరోగ్య వంతంగా మారిన తర్వాత వారిలో జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి తగ్గిపోవడం(Memory loss) లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటోంది లండన్ ఇంపీరియల్ కాలేజీ.
వారు దాదాపుగా 80 వేల మంది పై చేసిన పరిశోధనల తర్వాత ఈ లక్షణాలు ఉన్నట్టు తేల్చి చెప్పారు. అయితే ఈ లక్షణాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మానసిక సామర్థ్యంపై కోవిడ్ చూపే ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించగా , కోవిడ్ బారిన పడిన వారు చాలా తక్కువ స్కోర్ చేశారంట.


50 సంవత్సరాల ఉన్న వ్యక్తి కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 50 రోజుల ఆసుపత్రిలో వెంటిలీటర్‌పై కూడా చికిత్స తీసుకున్నాడు. తర్వాత కోలుకొని ఆరు నెలలు అవుతుంది. అయినప్పటికీ ఇంకా మామూలు మనిషి స్థితికి రాలేకపోతున్నాడు. ఆయన జ్ఞాపక శక్తికి సంబంధించి పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏ పనీ చేయలేక ఇంటికే పరిమితమయ్యాడు.
కోవిడ్ బారిన పడకముందు అనర్గళంగా పేపర్లో వార్తలు చదివిన వ్యక్తి ఇప్పుడు కోవిడ్ బారిన పడిన తర్వాత ఒక్క పేరా కూడా చదవలేకపోతున్నాడు. ప్రతి అక్షరం కూడబల్కొని చదవాల్సి వస్తుంది. వాటిని గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా మారిందని మరొకరు చెప్పారు.
జ్ఞాపక శక్తి(Memory loss) సమస్యలతో బాధపడుతున్న వారిలో ఎక్కువుగా చిన్నప్పటి విషయాలను మరిచిపోయారు. పుస్తకాల పేర్లు, ఊరి పేర్లను గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారు. ఎవరైనా ఏదైనా చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోలేకపోతున్నారు. అయితే కృత్రిమ వెంటిలేషన్ మీద ఉన్న రోగుల గ్రహణ శక్తిపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని లండన్ ఇంపీరియల్ కాలేజీ అధ్యయనంలో పేర్కొంది.


తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్నాయా?
అయితే కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరి మానసిక సామర్థ్యంపై ప్రభావం ఉండకపోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కొంత మందికి మాత్రం Covid బారిన పడిన కొన్ని వారాల తర్వాత పక్షవాతానికి గురవ్వడం, మాట పడిపోవడం లాంటి కేసులు కాకినాడలో తమ వద్దకు వచ్చినట్టు ప్రముఖ వైద్యులు డాక్టర్ యనమదల మురళీ కృష్ణ అంటున్నారు.
అయితే ప్రత్యేకంగా జ్ఞాపక శక్తి కోల్పోయిన కేసులు తమ దృష్టికి రాలేదని కాకినాడకు చెందిన ప్రైవేటు న్యూరో ఫిజీషియన్ డాక్టర్ గోపీ కృష్ణ చెబుతున్నారు. భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి, కంగారు, చిరాకు లాంటి సమస్యలతో ఎక్కువ మంది తమను సంప్రదిస్తారని చెప్పారు.


చికిత్స ఎలా?
ఇలాంటి(Memory loss) సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటే మందులు వేసుకోవడం కన్నా యోగా, ప్రాణాయామంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు సూచిస్తే బాగుంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోగులకు మెదడకు వ్యాయామం కలిగించే పదబంధాలను పూరించడం, రూబిక్ లాంటి వాటిని ఆడటం లాంటివి చేస్తే మెదడు యాక్టివిటీస్‌లో మార్పు వస్తుందని చెబుతున్నారు. కోవిడ్ మానసిక సామర్థ్యంపై ప్రభావం చూపిస్తే ఎలాంటి చికిత్స అందించాలనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ వెలువడలేదు. అసలు దీనిపై భారతదేశంలో ప్రత్యేకంగా అధ్యాయనాలు జరగలేదని వైద్యులు తెలుపుతున్నారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?