Memory Improve | జ్ఞాపకశక్తి పెరగాలంటే సరిగ్గా ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన వారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని అధ్యయనం తేల్చింది. Brigham and Woman ఆసుపత్రిలో జరిపిన అధ్యయనంలో ఈ విషయంలో తేలినట్టు జెన్ ఎఫ్ డఫీ పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని రాత్రి సమయంలో సరిపడా నిద్రపొమ్మన్నారు.
Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే
ఆపై నిర్వహించిన పరీక్షలో సుమారు 20 మంది వ్యక్తుల కలర్ ఫొటోలను, వారి పేర్లను వారికి చూపించారు. ఆ ఫొటోల్లో ఉన్న వారి రంగులు, పేర్లను సరిగ్గా 8 గంటల పాటు నిద్రించిన వారు సులభంగా కనిపెట్ట గలిగారని పరిశోధనలో తేలింది. 8 గంటలు పాటు Sleeping వారిలో 12 శాతం మంది జ్ఞాపకశక్తి కలిగి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారు. సరిపడా నిద్రించిన తర్వాత నేర్చుకునే కొత్త విషయాల ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తిని పొందవచ్చని డఫీ పేర్కొన్నారు. అయితే ఆరు,ఏడు గంటలు నిద్రిపోయిన వారిలో జ్ఞాపకశక్తి తగ్గిందని డఫీ చెప్పారు. తక్కువుగా నిద్రించిన వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారన్నారు.


Memory Improve: మిత ఆహారం జ్ఞాపకానికి మేలు!
తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజాలుంటాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. కొత్తగా ఇటలీలో జరిగిన పరిశోధనలో మరో కొత్త ప్రయోజనం బయటపడింది. రాత్రిపూట భోజనం ఎంత తగ్గిస్తే Memory Power అంత పెరుగుతుందట. అంతే కాదు, ఆహారం మోతాదు తగ్గించి ఓ కప్పుడు కాఫీ తాగి పడుకుంటే మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. బొజ్జనిండా భోంచేసి జబ్బుంటే మెదడు కూడా నిద్దరపోతుందని వీరి పరిశోధనా సారాంశం. జ్ఞాపకశక్తి సంగతెలా ఉన్నా, రాత్రి పూట భోజనం బరువు తగ్గించడం వల్ల లాబాలే కాని నష్టాలు లేవు. కాబట్టి నాలుగు ముద్దలు తక్కువతింటే సరి. ఆరోగ్యకరమైన డైట్ పాటించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేసి మెమొరీ పెరుగుతుంది. రన్నింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇవన్నీ మెదడును ఆరోగ్యకరంగా ఉంచుతాయి.


Memory Improve: బొప్పాయితో మతిమరపు దూరం!
ఏమిటీ మీరీ మధ్య తరుచూ మర్చిపోతున్నారు. ఏ వస్తువు ఎక్కడ పెట్టిందీ గుర్తకు రావడం లేదా? అయితే బొప్పాయితో దానికి చెక్ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ బొప్పాయి పండు తింటే మతిమరుపు ఉష్కాకి. బొప్పాయి పాలల్లో ఔషధ గుణాలున్నాయి. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పాలకు పేరిన ఎయ్యి కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గుతుందట!. కాలేయ పెరుగుదలను అరికట్టే గుణం బొప్పాయి పాలకు ఉంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలిగిపోతుంది. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది.