Mekapati Vikram Reddy | నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గ(atmakur by election) అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు నిర్ణయించినట్టు మేకపాటి కుటుంబం పేర్కొంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి మేకపాటి కుటుంబ నిర్ణయాన్ని తీసుకెళ్లారు.
మేకపాటి విక్రమ్ రెడ్డి నేపథ్యం!
మేకపాటి విక్రమ్ రెడ్డి(Mekapati Vikram Reddy) ఊటిలోనీ గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఐఐటీ చెన్నైలో సివిల్ సబ్జెక్టులో బీ.టెక్ పూర్తి చేశారు. అమెరికాలో కన్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చదివారు. దివంగత నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని తలపించే, అచ్చుగుద్దినట్టు ఆయనలా కనిపించేలా విక్రమ్ రెడ్డి రూపం ఉండటం గమనర్హం. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇతను రెండవ కుమారుడు.సోదరుడు దివంగత నాయకుడు గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగ్రేటం నాటి నుంచి సొంత అంతర్జాతీయ సంస్థ కేఎంసీ కి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు.
మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి బరిలో దిగుతారని మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగింది. కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలు, చర్చల అనంతరం మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూర్ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!