Mehndi (Gorintaku)

Mehndi (Gorintaku): గోరింట పండాలంటే ఇలా చేయండి!

Health News
Share link

Mehndi (Gorintaku): అమ్మాయిల అర‌చేతుల్లో గోరింటాకు విర‌బూయాల‌నీ, ఎర్ర‌టిపూల‌తో ఆక‌ట్టు కోవాల‌ని ప్ర‌తి అమ్మాయి మ‌న‌సూ మురిసిపోతుంది. అస‌లింత‌కీ దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలేంటి, అది ఎలా Mehndi (Gorintaku) పండుతుంది?

Gorintaku ఎర్ర‌గా పండాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ర‌సాయ‌నాల‌తో చేసిన కోన్‌ల జోలికి పోవ‌ద్దు. ఆకును తెంపుకుని మెత్త‌గా నూరుకోండి. రుబ్బేట‌ప్పుడు కాస్త చ‌క్కెర‌, రెండు ల‌వంగాలు వేయండి. గిన్నెలోకి తీసుకున్నాక ఆ మిశ్ర‌మానికి నాలుగైదు చుక్క‌ల Eucalyptus ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ని క‌లిపి ప‌క్క‌న పెట్టండి. ఓ అర‌గంట గ‌డిచాక గోరింటాకును చేతుల‌కు పెట్టుకోండి. క‌నీసం నాలుగైదు గంట‌లైనా ఉంచుకోగ‌లిగితే చ‌క్క‌టి రంగు వ‌స్తుంది.

Mehndi (Gorintaku) ఇలా చేయండి!

Gorintaku ఎండిపోతే చ‌క్కెర నిమ్మ‌ర‌సం క‌లిపిన సిర‌ప్‌లో ముంచిన దూదితో అద్దండి. పెనంపై ఇంగువ వేసి వేడి చేయండి. ఆ పొగ చేతుల‌కు త‌గ‌ల‌నివ్వండి. గోరింటాకు తీసేశాక ల‌వంగ నూనెను చేతికి రాసు కుంటే చక్క‌టి రంగులోకి వ‌స్తుంది. గోరింటాకుకి వేడిని త‌గ్గించే గుణం ఉంది. అందుకే అధిక‌వేడితో ఇబ్బందిప‌డేవారు అరికాళ్ల‌ల్లో దీన్ని పెట్టుకోవాల‌ని సూచిస్తారు. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగేలా చూస్తుంది.

మ‌హిళ‌లు త‌రుచూ దుస్తులు ఉత‌క‌డం, గిన్నెలు తోమ‌డం వంటి ప‌నులు చేస్తూ నీళ్ల‌ల్లో త‌డుస్తూ ఉంటారు. ఇలాంట‌ప్పుడే ఇన్ఫెక్ష‌న్లు దాడి చేస్తాయి. గోళ్లు, Skin పాడ‌వ‌కుండా గోరింటాకును పెట్టుకోవ‌డం వ‌ల్ల ఇది యాంటీ బ్యాక్టీరియ‌ల్‌గా ప‌నిచేస్తుంది. మాన‌సిక ఒత్తిడిని ద‌రిచేర‌నివ్వ‌ద‌ట గోరింటాకు. నువ్వుల నూనెలో, గోరింటాకును మ‌రిగించి త‌ల‌కు రాసుకుంటే జుట్టు ఎదుగుతుంది. తెల్ల వెంట్రుక‌లు త్వ‌ర‌గా రావు.

Mehndi (Gorintaku): గోరింట చెట్టు ఔష‌ధ గుణాలు

గోరింట చెట్టు మాను బెర‌డు ర‌సం గానీ, చూర్ణం గానీ, క‌షాయం గానీ లోప‌లికి సేవిస్తే చెడిపోయిన శ‌రీర‌ త‌త్వం తిరిగి పూర్తిగా బాగుప‌డుతుంది. ఇంకా ర‌క్తం తెల్ల‌గాపాలిపోయే పాండురోగం, పొట్ట బాన‌లాగా ఉబ్బిపోయే ప్లీహ‌రోగం, మూత్రం అతిక‌ష్టంగా వెలువ‌డే మూత్ర‌కృచ్ఛం, కుష్టు మొద‌లైన దారుణ చ‌ర్మ వ్యాధులు, మ‌ల‌బంధం, కాలిన పుండ్లు, వ్ర‌ణాలు మొద‌లైన ఎన్నో వ్యాధుల‌ను అవ‌లీల‌గా అణ‌చి వేయ‌గ‌ల శ‌క్తి గోరింట‌లో ఉంద‌ని ఆయుర్వేద మ‌హ‌ర్షులు త‌మ ప‌రిశోధ‌న‌ల ద్వారా రుజువు చేశారు. వారు తెలిపిన అనేక యోగాల‌లో కొన్ని యోగాల‌ను మ‌నం చెప్పుకుందాం.

నోటిపూత‌కు గోరింట: ఒక గ్లాసు మంచినీటిలో ప‌దిహేను గోరింటాకులు వేసి చిన్న‌మంట‌పైన ఒక క‌ప్పు క‌షాయం మిగిలేవ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత వ‌డ‌పోసి ఆ క‌షాయం గోరువెచ్చ‌గా అయిన త‌ర్వాత నోటిలో పోసుకొని అయిదు నుండి ప‌దినిమిషాల పాటు పుక్కిలించి ఊసివేయాలి. ఇలా రోజు రెండు పూట‌లా చేస్తుంటే ఎండ తీవ్ర‌త గ‌ల నోటిపూతైనా, నోటిపుండ్లైనా అతిత్వ‌ర‌గా త‌గ్గిపోత‌య్‌.

గోరింటాకు

త‌ల‌నొప్పికి-గోరింట‌: గోరింటాకును మెత్త‌గా గుజ్జులాగా నూరాలి. ఆ గుజ్జును క‌ణ‌త‌ల‌పైన మందంగా ప‌ట్టువేసి ప్ర‌శాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. క‌ణ‌త‌ల‌పై వేసిన గోరింట‌గుజ్జు ఎండిపోయేట‌ప్ప‌టికి త‌ల‌నొప్పి ఆశ్చ‌ర్య‌క‌రంగా త‌గ్గిపోతుంది.

See also  Temperature : ఈ రెండ్రోజులు మండే అగ్నిగోళ‌మే! | Sun Effect

గ్రంథుల‌కు, గాయాల‌కు గోరింట‌:శ‌రీరంలో చెడుప‌దార్థాలు అధిక‌మ‌య్యే కొద్ది అవి ర‌క్తాన్ని చెర‌చి శ‌రీరంపైన రాళ్ల‌వంటి కంతులుగా, గ‌డ్డ‌లుగా, గ్రంధులుగా త‌యార‌వుతుంటాయ్‌. అలాంటి స‌మ‌స్య‌లున్న‌ వారు గోరింటా కును పైన తెలిపిన విధంగా మెత్త‌గా నూరి వాటిపై మందంగా నిద్రించేముందు పూసి దానిపైన దూదిప‌రిచి బ‌ట్ట‌తో క‌ట్టు క‌ట్టుకొని ఉద‌యం తీసివేయాలి. ఈ విధంగా క్ర‌మం త‌ప్ప‌కుండా ఆచ‌రిస్తుంటే రాళ్ల వంటి గ్రంథులు క్ర‌మంగా త‌గ్గిపోతుంటాయి. అదే విధంగా మొండి గాయాల‌కు కూడా లేప‌నం చేయ‌డం వ‌ల్ల గాయాలు కూడా అతి త్వ‌ర‌గా మాడిపోయి తిరిగి Skin Color వ‌స్తుంది.

Leave a Reply

Your email address will not be published.