Megha Engineering Infrastructures ltd శ్రీనగర్: ప్రతి కూల వాతావరణంలో కూడా వేగంగా పనిచేస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. కార్గిల్- శ్రీనగర్ మధ్య చేస్తున్న టన్నెల్ పనులు 30శాతం పూర్తయ్యాయి. ఆసియాలోనే అతి పొడవైన ద్విమార్గ టన్నెల్‌ను నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ శరవేగంగా పనులను పూర్తి చేస్తుంది. ఇప్పటికే 5 కి.మీ వరకు జోజులా టన్నెల్ పనులూ పూర్తయ్యాయి. మొత్తం 18 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో ఇప్పటి వరకు 30శాతం పనులు పూర్తయ్యాయి.
కార్గిల్-శ్రీనగర్ మధ్య రాకపోకలు
ఈ టన్నెల్ పూర్తయ్యితే కార్గిల్-శ్రీనగర్ మధ్య సొరంగం నుండి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. -30 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో మంచు కొండలు విరిగిపడుతున్నా కూడా కార్మికులు పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అతి కఠినమైన కొండలను తొలగిస్తూ తీవ్రమైన మంచు కురుస్తున్నా పనులు మాత్రం ఆపకుండా కొనసాగిస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ(Megha Engineering Infrastructures ltd). ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు టన్నెల్స్, నాలుగు బ్రిడ్జీలు, మంచును నిరోధించే నిర్మాణాలు, కల్వర్టులు తదితర నిర్మాణాలను నిర్మిస్తోంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 18 టన్నెల్స్‌తో పాటు 12 రోడ్లను కూడా నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 11,500,78 అడుగుల ఎత్తులో జోజులా టన్నెల్ పనులు సాగుతున్నాయి. జోజులా టన్నెల్స్ ప్రాజెక్టులో మొత్తం 3 టన్నెల్స్ ఉన్నాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!