Megastar Chiranjeevi Re Entry in Politics | మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి!Vijayawada: మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న చర్చల్లో భాగంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి మనోహర్ నాదేండ్ల శుభవార్త చెప్పారు. పవన్ కళ్యాణ్ ను మళ్లీ సినిమాలు చేయాలని కోరింది అన్న చిరంజీవేనని తెలియజేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట త్వరలో నడవడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధంగా ఉన్నారని వార్త తెలిజేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు నచ్చి , అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి స్పష్టమైన హామీ ఇచ్చారని నాదేండ్ల మనోమర్ తెలిపారు.


మెగాస్టార్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ పార్టీ అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల పర్యటనలు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర పర్యాటక మంత్రిగా పదవిని నిర్వహించారు. ప్రస్తుతం కొన్ని సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉండి, సినిమాలు తీస్తున్నారు. తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరనున్న వార్త ఇటు అభిమానుల్లోనూ అటు కార్యకర్తల్లోనూ సంతోషం నింపుతోంది. ఇప్పటికే మరో సోదరుడు నాగబాబు జనసేన పార్టీ తరపున క్రియాశీలక రాజకీయాల్లో ప్రయాణం కొనసాగిస్తూ ఇటీవల ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ జనసేన పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అప్పుడప్పుడు సోషల్మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఇది చదవండి:స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన పార్టీలు
ఇది చదవండి:హత్యకు గురైన స్వామీజీ? వివాదమే కారణమా?
ఇది చదవండి:ఈ ఎన్నికలకు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ
ఇది చదవండి: కరోనా సేవలకుగాను సీఐకి ప్రశంసాపత్రం అందజేత
ఇది చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు