Core Web Vitals Assessment: Meditation benefits on brain:నువ్వు మాన‌సికంగా బాగుండాలంటే ధ్యానం

Meditation benefits on brain:నువ్వు మాన‌సికంగా బాగుండాలంటే ధ్యానం స‌మ‌ర్ప‌యామి

Meditation benefits on brainమ‌న‌సు ప్ర‌శాంతంగా ఉన్న‌ప్పుడే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (life is beautiful) అనిపిస్తుంది. కానీ ఖ‌ర్చు లేకుండా నిఖార్స‌యిన ప్ర‌శాంత‌త దొర‌కాలంటే మాత్రం ధ్యానానికి మించిన మార్గం లేదు. ప్ర‌తి ఉద‌యం ఓ ప‌ది నిమిషాలు ధ్యానానికి(Dyanam) మించిన మార్గం లేదు. ప్ర‌తి ఉద‌యం ఓ ప‌ది నిమిషాలు ధ్యానానికి స‌మ‌ర్పిస్తే రోజంతా ఏ టెన్ష‌న్ లేకుండా Relaxide గా ఉండొచ్చు.

అనువుగాని చోటు ధ్యానానికి స‌రికాదు. అందుకే మీ మెడిటేష‌న్‌(Meditation benefits on brain)కు స‌రైన ప్ర‌దేశం ఎంచుకోండి. లేలేత సూర్య‌కిర‌ణాలు ప్ర‌స‌రించే వేళ‌, డాబాపైకి వెళ్లి క‌ళ్ళు మూసుకుని కూర్చొండి. మీ ధ్యానం నిర్విఘ్నంగా సాగ‌డంతో పాటు మెరుగైన ఆరోగ్యానికి స‌రిపడా విట‌మిన్‌-డి దొరుకుతుంది.

భౌతికంగానే కాదు మాన‌సికంగా ధ్యానంలోకి వెళ్లాలంటే కాస్త క‌ష్ట‌మే. అయితే మ‌నుసుకు న‌చ్చిన సంగీతం(Music) విన‌డం ద్వారా ఈ ఇబ్బందిని అధిగ‌మించ‌వ‌చ్చు. కోడి కూసే వేళ హెడ్‌ఫోన్స్ త‌గిలించుకుని ఏ తోడి రాగ‌మో విన్నారా.. మీ మ‌న‌సు స‌రిగ‌మ‌ల తోట‌లో విహ‌రిస్తూ కొంత స‌మ‌యానికి నిశ్చ‌లానందం పొందుతుంది. కావాలంటే ఒక‌సారి ట్రై చేసి చూడండి.

ఇంటి ద‌గ్గ‌ర మెడిటేష‌న్ చేసే ప‌రిస్థితి లేద‌నుకునే వాళ్లు ద‌గ్గ‌ర్లోని పార్క్‌కో, గుడికో వెళ్లి కూర్చుంటే స‌రిపోతుంది. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో చేసే ధ్యానం మీపై తొంద‌ర‌గా ప్ర‌భావం చూపుతుంది కూడా. మెడిటేష‌న్‌లో మొద‌ట‌గా శ్వాస‌పై దృష్టి కేంద్రీక‌రించాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని నిదానంగా వ‌ద‌లాలి. ఇలా చేయ‌డం హృద‌య స్పంద‌న‌ల‌పై అనుకూల ప్ర‌భావం చూపుతుంది. ఫ‌లితంగా ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌జావుగా సాగి మెద‌డు చురుకుగా ప‌నిచేస్తుంది. ఒత్తిళ్ల‌ను ఎదుర్కొనే ఆత్మ‌స్టైర్యం క‌లుగుతుంది. ధ్యానం వ‌ల్ల వ‌ర్కింగ్ మెమొరీ ఆఫ్ పెన్సిల్వేనియా ప‌రిశోధ‌కులు అమిషి ఝూ నిరూపించారు. ధ్యానం అవ‌స‌ర‌మైన ఆలోచ‌న‌ల‌ను నియంత్రిస్తుంది. మ‌న ఆలోచ‌న‌ల్ని మ‌న‌మే ఎంపిక చేసుకునే శ‌క్తినిస్తుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *