medical

medical facts 2022: వైద్య రంగంలో ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాలు!

Viral News

medical facts 2022 | వైద్య రంగంలో కొత్త కొత్త మందులు పుట్టుకొస్తుంటాయి. ఆధునిక ప‌ద్ధ‌తులు కొత్త పుంత‌ను తొక్కుతుంటాయి. పూర్వ కాలంలో ఉన్న కొన్ని ప‌ద్ధ‌తుల‌నే ఈ కాలంలో ఆధునిక ట్రీట్మెంట్‌గా చెప్పి ప్ర‌చారం చేసేవారు లేక‌పోలేదు. ఇలాంటి వాటిలో సూది గురించి ఒక ఇంట్ర‌స్టింగ్ స్మాల్ స్టోరీ(medical facts 2022) మీకోసం.

సూది(injection story) పొడుపు కథ‌

చైనాలో అనాదిగా ఒక ర‌కం వైద్య చికిత్స వాడుక‌లో ఉంది. ఇది విచిత్ర మైన‌ది. బాధ‌గా ఉన్న చోట ఒక ఇంజక్ష‌న్(injection) సూదిని 10-15 సార్లు పొడ‌వ‌ట‌మే దీని స్పెషాలిటీ. ముందు మ‌త్తు మందుతో బాధ‌గా ఉన్న చోట‌ని మొద్దుబారి పోయేట్లు చేసి త‌ర్వాత ఖాళీగా ఉండే ఇంజక్ష‌న్ సూదితో అక్క‌డ పొడుస్తారు. ఈ ప‌ద్ధ‌తిని ఇప్పుడు ఆధునిక వైద్యులు వాడుతున్నారు. చాలా కాలంగా ప‌చ్చిగా ఉంటున్న చోటు మీద‌(ఇంకే ర‌క‌మైన చికిత్సా ప‌నిచెయ్య‌క పోయిన‌ట్ల‌యితే) సూది పెట్టి పొడుస్తారు.

medical
సూది

ఇది ఎలాగ ప‌నిచేస్తుంది? అంటే..మొద్దు బారిన దెబ్బ త‌గిలితే ర‌క్త‌స్రావం ఉంటుంది. కానీ ర‌క్తం బ‌య‌ట‌కు కార‌క‌పోతే అక్క‌డే పేరుకు పోయి వాపు వ‌స్తుంది. వాపు వ‌ల్ల న‌రాలు బాధ‌ని తెలుపుతాయి. సూది పొడ‌వ‌డం ద్వారా ర‌క్తం బ‌య‌టికి వ‌చ్చేసే అవ‌కాశం ఉంటుంది. వాపు త‌గ్గుతుంది. బాధ కూడా పోతుంది.

Thalidomide: ధాలిడోమ‌యిడ్ కొత్త విశేషాలు!

ధాలిడోమ‌యిడ్‌(Thalidomide)ని గురించి మీరు వీనే ఉంటారు. ఈ మందున్ని పుచ్చుకున్న కొంద‌రు గ‌ర్భ‌వ‌తుల పిల్ల‌లు విక‌లాంగులుగా పుట్టారు. దీనిని గురించి చాలా గొడ‌వ అయ్యింది. ఎందుకు ఇటువంటి ఘోరం జ‌రిగింద‌ని ప‌రిశోధ‌కులు జ‌రుపుతున్నారు. ఈ ప‌రిశోధ‌న‌ల వ‌ల్ల ఒక సిద్ధాంతం బ‌య‌ట‌ప‌డ్తోంది. దీని ప్ర‌కారం, ధాలిడోమ‌యిడ్ కొంద‌రు స్త్రీల‌కు ప‌డ‌దు.

medical
టాబ్లెట్‌

ఈ మందే కాదు..వేరే మందుల‌కు ఈ గుణం ఉంది. మామూలుగా వాడే ఎన్నో మందులు ఎంద‌రికో ప‌డ‌వు. జ‌లుబుకి వాడే ఎట్రోపిన్‌, బెల్ల‌డోనాల వ‌ల్ల కొంద‌రిని క‌ల‌వ‌రం, మూర్ఛ రావ‌చ్చు. ఇవి పోవ‌డానికి మ‌ళ్లీ చికిత్స కావాలి. ఈ (సాధార‌ణంగా మ‌త్తు మందులు వాడుతారు.) మరి దీనికి విరుగుడు ఏమిటి?..అంటే జంతువుల మీద చేసిన ప‌రిశోధ‌న‌ల బట్టి ధాలిడోమ‌యిడ్‌కి నికోటినెమ‌యిడ్ బాగా ప‌ని చెయ్య‌వ‌చ్చు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *