Medical Checkup

Medical Checkup: 18 ఏళ్ల నుంచే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిద‌ట‌!

Spread the love

Medical Checkup | ఎప్ప‌టి నుంచి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి? దీనికి వ‌య‌సంటూ ఏమైనా ఉందా? ఎందుకైనా మంచిది. 18 ఏళ్లు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి BP పరీక్షించుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. గుండె జ‌బ్బులో బ్ల‌డ్ ప్రెష‌ర్ లేదా ర‌క్త‌పోటు కీల‌క పాత్ర పోషిస్తున్నందువ‌ల్ల‌, దీని విష‌యంలో కొన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌ర‌మ‌ని(Medical Checkup) వారు స‌ల‌హా ఇస్తున్నారు. 18 ఏళ్ల వ‌య‌సులో Raktha Potu ప్రారంభ‌మైతే న‌డివ‌య‌సులో గుండె స‌మ‌స్య‌లు రావ‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని Chicago యూనివ‌ర్శిటీలో దాదాపు 25 ఏళ్ల పాటు జ‌రిపిన ఓ స‌మ‌గ్ర అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

ల‌క్ష‌ల్లో ర‌క్త‌పోటు బారిన కుర్ర‌కారు

న‌డివ‌య‌సులో వ‌చ్చే గుండె జ‌బ్బుల్ని ముందే తెలుసుకొని, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికి 18 ఏళ్ల నుంచే Health ప‌రీక్ష‌లు జ‌రిపించుకుంటూ ఉండాల‌ని కూడా వారు మ‌రో విధంగా సూచిస్తున్నారు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది యువ‌తీ యువ‌కుల్లో అతి చిన్న వ‌య‌సు నుంచే Blood pressure ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని, ర‌క్త‌పోట్లు ర‌క‌ర‌కాల స్థాయిల్లో బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని Charles west నాయ‌క‌త్వంలో ప్రివెంటివ్ మెడిసిన్ విభాగ అధ్యాప‌కులు తెలిపారు. ఇప్ప‌టి యువ‌త‌లో గుండె సంబంధ‌మైన ప్ర‌మాదావ‌కాశాలు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని, ఆధునిక జీవ‌న శైలి వాళ్ల‌ను ప్రాణాంత‌క వ్యాధుల‌కు ద‌గ్గ‌ర చేస్తోంద‌ని వార‌న్నారు.

Medical Checkup

18 ఏళ్ల‌కే ర‌క్త‌పోటు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న కుర్ర‌కారు సంఖ్య ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ల‌క్ష‌ల్లో ఉంది. ఎందుకైనా మంచిది, ఆ Age నుంచే త‌రుచూ ఆరోగ్య ప‌రీక్షలు చేయించుకోవ‌డం శ్రేయ‌స్క‌రం. లేని ప‌క్షంలో రిస్క్ పెరిగి, న‌డివ‌య‌సులోనే ఆయుర్దాయూనికి తెర‌ప‌డ‌డం ఖాయం అని వెస్ట్ చెప్పారు. ర‌క్త‌పోటు మొద‌లైనప్పుడు న‌డివ‌య‌సు వ‌ర‌కూ దాన్ని అలాగే వ‌దిలేయ‌కూడ‌దు. చిన్న‌త‌నంలోనే ఒక స్థాయి ద‌గ్గ‌ర దాన్ని నిరోధించ‌గ‌లిగితే గుండె జ‌బ్బులు, ప‌క్ష‌వాతాలు వ‌గైరా జ‌బ్బులు నుండి త‌ప్పించుకోవ‌డానికి వీలుంటుంది. 18 నుంచి 55 ఏళ్ల వ‌య‌సువారి మ‌ధ్య ర‌క్త‌పోటుకు సంబంధించిన ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ప్పుడు, ఒక్కొక్క‌రిలో ఒక్కో విధ‌గా ర‌క్త‌పోటు క‌నిపించింద‌ని, ఇది ఒక్కొక్క‌రికీ ఒక్కో విధంగా ప్రాణాంత‌క వ్యాధుల్ని తెచ్చిపెట్టే ప్ర‌మాదం ఉంద‌ని వెస్ట్ వివ‌రించారు.

ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం ఉత్త‌మం!

Heartకు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే నాళాలు దెబ్బ‌తిన‌డం చాలా మందిలో 18 ఏళ్ల‌కే ప్రారంభం కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని, ప్ర‌తివారూ చిన్న వ‌య‌సు నుంచే ఆరోగ్య ప‌రీక్షలు జ‌రిపించుకోవాల్సిన అగ‌త్యాన్ని ఇది చెప్ప‌క‌నే చెబుతోంద‌ని వెస్ట్ అన్నారు. యువ‌తీ యువకుల్లో ర‌క్త‌పోటు ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే, ఆధునిక జీవ‌న‌శైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవ‌స‌రాన్ని వాళ్ల‌కు వివ‌రిస్తున్నామ‌ని, అయిన‌ప్ప‌టికీ రిస్క్ పూర్తిగా తొలిగిపోయింద‌ని చెప్ప‌లేక‌పోతున్నామ‌ని అంటూ ఆయ‌న‌, ర‌క్త‌పోటు ఎప్పుడూ ఏ ప్ర‌మాదం తెచ్చిపెడుతుందో చెప్ప‌లేమ‌ని తెలిపారు. చిన్న‌త‌నంలోనే ర‌క్త‌పోటు ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్పుడు వెనువెంట‌నే ప‌రీక్షలు జ‌రిపించుకుని చికిత్స తీసుకోవ‌డం వ‌ల్ల ఆయుర్ధాయానికి భ‌ద్ర‌త ఏర్ప‌డుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

Medical Checkup

నిర్ల‌క్ష్యం చేయ‌రాదు!

నిజానికి ర‌క్త‌పోటును వెంట‌నే అరిక‌ట్ట‌వ‌చ్చు. ఆల‌స్యం చేసిన కొద్దీ గుండె మీదా, ర‌క్త నాళాల మీదా దాని ప్ర‌భావం ఉంటుంద‌నే సంగ‌తిని మ‌రిచిపోకూడ‌దు. అందువ‌ల్ల ఎంత త్వ‌ర‌గా స్పందిస్తే ఆరోగ్యానికి అంత మంచిది. అని కూడా వారు సూచించారు. పిన్న వ‌య‌సువారిలో గుండె, ర‌క్తం, ఊపిరితిత్తుల ప‌రీక్ష‌లు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని, వేలాది మంది యువ‌తీయువ‌కుల‌పై Doctors ప‌రీక్ష‌లు జ‌రిపారు. టీనేజ్ పిల్ల‌ల్లో కూడా ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా ర‌క్త‌పోటు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని. అందుక‌ని 18 ఏళ్ల వ‌య‌సు నుంచే ప‌రీక్ష‌లు జ‌రిపించుకోవ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని చికాగో డాక్ట‌ర్లు చెబుతున్నారు.

medical facts 2022: వైద్య రంగంలో ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాలు!

medical facts 2022 | వైద్య రంగంలో కొత్త కొత్త మందులు పుట్టుకొస్తుంటాయి. ఆధునిక ప‌ద్ధ‌తులు కొత్త పుంత‌ను తొక్కుతుంటాయి. పూర్వ కాలంలో ఉన్న కొన్ని ప‌ద్ధ‌తుల‌నే Read more

7 Glasses Water: రోజుకు 7 గ్లాసులు నీరు తాగాల్సిందే లేకుంటే త‌ప్ప‌దు ప్ర‌మాదం!

7 Glasses Water | రోజుకి ఏడు గ్లాసుల నీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో 200 కాల‌రీలు త‌గ్గుతాయ‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా. కానీ ఇది నిజం. Read more

Vitamin Q: విట‌మిన్ క్యు వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి?

Vitamin Q | క‌ళ్ల ప‌క్క‌న గీత‌లు క‌నిపిస్తున్నాయా? నుదుటి మీద గీత‌లు ఉన్న‌ట్టు గ‌మ‌నించారా? న‌వ్వితే మూతికిరువైపులా వ‌ల‌యాలు ఏర్ప‌డుతున్నాయా, అయితే అవి వ‌య‌సు పైబ‌డుతున్న Read more

raw coconut water: summer drink కొబ్బ‌రి నీళ్లు కాక‌పోతే మ‌రేమిటి?

raw coconut water | ఎండ‌లు మండిపోతున్నాయి. వేస‌వి రాక‌ముందే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండే ఎండ‌ల‌కు ఉష్ణోగ్ర‌త‌ల్లో మార్పులు రావ‌డం, అనారోగ్యాల‌కు గుర‌య్యే ప్ర‌మాదం లేక‌పోలేదు. Read more

Leave a Comment

Your email address will not be published.