Medi Classic Insurance Policy | వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకం(మెడిక్లాసిక్)
Medi Classic Insurance Policy | వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకం(మెడిక్లాసిక్)
Star Health Insurance వారి యొక్క Medi Classic Insurance Policy గురించి ప్రాథమిక అంశాలను తెలుసుకోండి. ఈ పాలసీ ఎవరైనా ఒక్కరు మాత్రమే తీసుకోవాలి. ఫ్యామిలీ మొత్తానికి ఒకే పాలసీ తీసుకునే అవకాశం ఈ పాలసీలో లేదు. అయితే ఫ్యామిలీ మొత్తంగా తీసుకోవాలనుకుంటే ఎవరికి వారు సొంతగా పాలసీ తీసుకొని ఒక్కొక్కరికి సపరేట్గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది మొత్తం ఎంత అవుతుందో ఆ వయస్సు వారిని బట్టి ఫ్యామిలీలో ఒక్కరుకు మాత్రమే ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కేవలం వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ.
ఈ పాలసీ 5 నెలల నుండి 65 సంవత్సరాల లోపు ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. 50 సంవత్సరాలు దాటిన వారు ఈ పాలసీ తీసుకోవాలను కుంటే ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేపించుకోవాలి. అప్పుడే ఈ పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ చెకప్‌కు అయ్యే ఖర్చు Star Health Insurance కంపెనీనే భరిస్తుంది.
Policy Term(పాలసీ టర్మ్)
1 సంవత్సరం/ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలకు కలిపి ఒకేసారి ప్రీమియం కట్టుకుంటే 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. లేకుంటే 1 సంవత్సరమైనా తీసుకోవచ్చు.
Sum Insured Options(పాలసీ విలువ)
రూ.1,50,000/-(లక్షాయాభై వేలు)
రూ.2.00,000/-(రెండు లక్షలు)
రూ.3,00,000/- (మూడు లక్షలు)
రూ.4,00,000/-(నాలుగు లక్షలు)
రూ.5,00,000/- (ఐదు లక్షలు)
రూ.10,00,000/-(పది లక్షలు)
రూ.15,00,000/-(పదిహేను లక్షలు)
Benefits(పాలసీ కవరేజ్)
ఈ మెడిక్లాసిక్ పాలసీ తీసుకున్న వ్యక్తులు ఆసుపత్రిలో చేరాక, 24 గంటల పాటు ఉన్నట్లయితే పాలసీ షరుతులకు లోబడి క్రింది ఖర్చులు చెల్లించబడతాయి.
– గది అద్దె, భోజనం, నర్సింగ్ ఖర్చులు కోసం.
– ఒక రోజుకు బీమా మొత్తంపై 2 % లేదా గరిష్టంగా రూ.5,000/- ల వరకు చెల్లించబడుతుంది.
– సర్జన్, మత్తు మందించే డాక్టర్లు, కన్సల్టెంట్ డాక్టర్, నిపుణుల ఫీజు.
– మత్తు, రక్తం, ఆక్సీజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, శస్త్ర చికిత్స ఉపకరణాలు, మందులు మరియు రోగ నిర్థారణ పరీక్షలు
– డయాలసిస్, కీమో థెరపీ, రేడియో థెరపీ, ఫేస్ మేకర్, స్టంట్ మరియు ఇతర ఖర్చులు వర్తిస్తాయి.
– అంబులెన్స్ ఛార్జీలు: ఒక హాస్పిటలైజేషన్కు రూ.750/- గరిష్టంగా రూ. 1500/- ఇవ్వబడతాయి.
డేకేర్ విధానానికి కవరేజ్ 100 కు పైగా చికిత్సలకు సదుపాయము కలదు.
నోక్లెయిమ్ బోనస్:క్లెయిమ్ చేయని సంవత్సరాలకు గరిష్టంగా బీమా మొత్తంలో 25% బోనస్ పొందవచ్చును
ఆటోమెటిక్ రిస్టోరేషన్:
ఒక పాలసీ సంవత్సరం లోపల బీమా మొత్తం అయిపోతే, మళ్లీ పూర్తి భీమా మొత్తంపై రెండు రెట్ల (200%) భీమా మొత్తం ఉచితంగా అందుబాటులోకి తెచ్చే సదుపాయం కలదు.
ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు:
ఆసుపత్రిలో చేరకముందు 30 రోజుల్లోపు భరించిన ఖర్చులు చెల్లించబడతాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 60 రోజుల్లోపు భరించిన ఖర్చులకై గరిష్టంగా రూ.5000/- ల వరకు చెల్లించబడతాయి.
ఆరోగ్య తనిఖీ (హెల్త్ చెకప్) సౌకర్యం:
రూ.2 లక్షలు, ఆఫైన భీమా కలిగి ఉండి, వరుసగా 4 సంవత్సరాలు క్లెయిం చేయని యెడల భీమా మొత్తం
పై 1% గానీ లేదా గరిష్టంగా రూ.5000/- వరకు ప్రయోజనం పొందవచ్చును.
ప్రీమియంపై 5% డిస్కౌంట్:
రెండు సంవత్సరాల ప్రీమియం(Medi Classic Insurance Policy) ఒకేసారి చెల్లించినట్లయితే మీ రెండు సంవత్సరాల మొత్తం ప్రీమియంపై 5% వరకు తగ్గింపు పొందవచ్చు.
హాస్పిటల్ డెయిలీ క్యాష్ బెనిఫిట్ (ఆప్షనల్ ప్రయోజనం)
– ఆసుపత్రి లో ఉన్న ప్రతి రోజుకు రూ.1,000/- ల చొప్పున గరిష్టంగా ఒక హాస్పిటలైజేషన్ కు రూ. 7,000/- ల వరకు మరియు ఒక పాలసీ సంవత్సరంలో గరిష్టంగా రూ.14,000/- ల వరకు ప్రయోజనం పొందవచ్చు.దీనికయ్యే అదనపు ప్రీమియం రూ.350/-
పేషెంట్ కేర్ బెనిఫిట్ (60 సంవత్సరాల పైన వయసు వారికిచ్చే ఆప్షనల్ ప్రయోజనం)
– హాస్పిటలైజేషన్ తర్వాత ఒక అంటెండెంట్ను ఏర్పాటు చేసుకున్నందుకు ఒక రోజుకు రూ.400/- చొప్పున గరిష్టంగా 5 రోజుల వరకు మరియు పాలసీ సంవత్సరంలో గరిష్టంగా 14 రోజుల వరకు ప్రయోజనం పొందవచ్చు. దీనికయ్యే అదనపు ప్రీమియం రూ.580/-.
మినహాయింపులు
ముందుగానే ఉన్న రుగ్మతలు:
పాలసీని క్రమం తప్పకుండా పునరుద్ధరణ చేసినట్టయితే 48 నెలల తర్వాత, ముందుగానే ఉన్న రుగ్మతలు కూడా కవర్ చేయబడతాయి.
30 రోజుల మినహాయింపు:
పాలసీ క్రింద మొదటి సంవత్సరంలో, కవర్ తేదీ నుండి మొదటి 30 రోజుల సమయంలో సుస్తీ/ వ్యాధికి చేసే ఏదైనా క్లెయిం ఇవ్వబడదు. యాక్సిడెంట్ కారణం గా కలిగిన గాయాలకు సంబంధించిన క్లెయింలకు ఈ మినహాయింపు వర్తించదు.
మొదటి రెండు సంవత్సరాల మినహాయింపులు:
కంటి శుక్లం, హిస్తోరెక్టమి, మోకాలిచిప్ప లేక కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స (ప్రమాదం వల్ల అవసరం అయ్యేది కాకుండా), వెరికోస్ వెయిన్స్, ఫిస్టులా – ఇన్ ఏనో, పైల్స్, సైనసైటిస్, పిత్తాశయ, మూత్రపిండాల్లోని రాళ్ల తొలగింపు, హెర్నియా మరియు పాలసీలో పొందుపరిచిన మొదలగు వ్యాధులు.
సహా చెల్లింపు:
61 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు కొత్తగా పాలసీ తీసుకున్న యెడల ప్రతి క్లెయింకు 10% సహా చెల్లింపు నిబంధన వర్తిస్తుంది.



ఇది చదవండి: దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో తెలుసా?