Enkoor: ఖమ్మం జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. తన కూతురు చనిపోవడంతో ఆమె డెడ్‌బాడీని బైక్‌పై ఓ తండ్రి తీసుకెళ్లిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే వైరా నియోజకవర్గం ఏన్కూరు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో కొత్త మేడేపల్లి (Medepalle) లో ఈ ఘటన వెలుగు చూసింది.
Enkoor ఏజెన్సీ గిరిజనుల పరిస్థితి ఇదీ!
వైరా నియోజకవర్గంలో Enkoor ఏజెన్సీ గిరిజన మండలంగా గుర్తింపు ఉంది. కొత్త మేడేపల్లి అనే గ్రామం ఏన్కూరు మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆదివాసీ గ్రామంలో గిరిజనులు అనారోగ్యానికి గురైతే ప్రాణాలు వదలాల్సిందే. వారికి సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వాలు వేలకు వేలు ఖర్చు చేస్తున్నామని ప్రగల్భాలు పలికినప్పటికీ ఆచరణలో మాత్రం అది శూన్యమనేది తెలుస్తోంది.
ఈ ఆదివాసీ గ్రామం అయిన కొత్త మేడేపల్లికి 108 వాహనం కూడా వెళ్లదు. వారు ఆసుపత్రికి వెళితే వైద్యులు సక్రమంగా స్పందిచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కొత్తమేడేపల్లి లో గతేడాది 40 మంది పిల్లలకు పాఠశాల ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుని కూడా నియమించారు. కానీ ఏడాది పాఠశాలను మూసేశారు.


Bhukya Veerabhadram: సుక్కి కుటుంబానికి న్యాయం చేయాలి
సుక్కి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేసి, రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా కొత్త మేడేపల్లి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. గ్రామంలో చిన్నపిల్లలు, మహిళలు పౌష్టికాహారం లేక దీనమైన పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు కొత్త మేడేపల్లి ఆదివాసీ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.