medaram jatara invitation 2022 హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మంగళవారం మంత్రులు ప్రగతి భవనంలో అందజేశారు. ఈ సందర్భంగా మేడారం(medaram jatara) మహా కుంభమేళ జాతరకు రావాలని సీఎం కేసీఆర్(cm kcr)ను ఆహ్వానించారు.
సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక (invitation 2022)అందజేసిన వారిలో గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గరావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!