Medaram Jatara 2022 ములుగు: మేడారం మహాజాతర సమీపిస్తున్న తరుణంలో జాతర విజయవంతానికి ఆదివాసీ పెద్దలు మరియు ఆదివాసీ సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టర్ ఆడిటోరియంలో ITDA ఆధ్వర్యంలో ఆదివాసీ పెద్దలు, ఆయా సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
మహా జాతరకు సహకరించాలి: కలెక్టర్
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటిడిఎ ఇన్‌ఛార్జి పీఓ ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఆదివాసీ సంఘాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. అన్ని సంఘాలు జాతర(Medaram Jatara 2022) విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఆదివాసీల అభిప్రాయాలు సేకరణ
కార్యక్రమ ప్రారంభంలో ఆదివాసీ సంఘం నాయకుల అభిప్రాయాలను వివరించాలని వారి అభిప్రాయాలను చట్టపరంగా అమలు చేస్తామని అన్నారు. సమావేశంలో ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ మద్యం బెల్లం కొబ్బరి కాయల షాపుల పర్మిషన్ ఒక వారం రోజులే కాకుండా రెండు వారాలు తిరుగు వారం వరకు పర్మిషన్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ జాతర నిర్వహణ ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది అన్ని సంఘాల పెద్దలతో ఆదివాసీ పెద్దలతో ఈ నెల 19వ తేదీన మేడారం ఆదివాసీ మీటింగ్ హాల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని సూచించారు.

ఆదివాసీ భవిష్యత్తు కోసం ఆదివాసీ గిరిజన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని చదువు వారి భవిష్యత్తు మార్చుతుందని వ్యాపారం చేసుకుంటారని ఆర్థిక అభివృద్ధికి ఐటిడిఎ ద్వారా రుణాలు మంజూరు చేస్తానని పూర్తిగా తాను బాధ్యత తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటి, డిఆర్ఓ రమావేవి, ఐటిడిఎ ఎపిఓ జె.వసంతరావు, డిటిఓ మంకి డి.ఎర్రయ్య, తాడువాయి తాశీల్దార్ శ్రీనివాస్, పెస్ జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు, ఐటిడిఎ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ