tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమై ఇప్పటి వరకు 13 రోజులు పూర్తయ్యాయి. ఈ ఆటల్లో భారత్ క్రీడాకారులు అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. ఈ ఒలింపిక్ గేమ్స్‌లో భారత దేశం ఐదు పతకాలను గెలుచుకుంది. మొదటిగా 49 కేజీల కేటగిరీలో వెయిల్ లిఫ్టింగ్ ఛాంపియన్ Meerabai chanu రజత పతకం గెలుచుకున్నారు. గతంలో రియో ఒలింపిక్స్ గేమ్స్‌లో గాయ కారణంగా ఆమె తొలిరౌండ్లోనే ఇంటి బాట పట్టారు. కానీ ఈ టోక్యో ఒలింపిక్స్(tokyo olympics 2021)లో వీరోచిత పోరాటం చేసి గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ మొట్టమొదటిగా ఆమె రజతం గెలిపించి భారత్ పేరు మారుమ్రోగేలా చేశారు.
షట్లర్ పోటీలో భారత్ స్టార్ p v sindhu గత ఆదివారం చరిత్ర సృష్టించారు. ఈ గేమ్స్‌లో చైనాకు చెందిన హే బింగ్ జియావోపై గెలిచి ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. రెండు ఒలింపక్ పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళాగా పీవీ సింధు చరిత్రలో నిలిచారు. గత రియో ఒలింపిక్స్(2006) లో ఆమె రజత పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.
బాక్సింగ్‌లో loveleena borgohain సెమీ ఫైనల్స్‌లో చైనా తైపీ క్రీడాకారిణి చెన్నియెన్ చిన్‌పై గెలిచి సెమీస్‌లోకి అడుగు పెట్టారు. ఈ సెమీస్‌లో టర్కీకి చెందిన ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణి సుర్మేనేలితో లవ్లీనా తలపడి, 5-0 తేడాతో ఓడిపోయారు. దీంతో ఈ క్రీడాకారిణికి కాంస్య పతకం దక్కింది. బాక్సింగ్‌లో మూడో స్థానం కోసం మ్యాచ్ ఉండదు కాబట్టి సెమీస్‌లో నిలిచిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు.
డిస్కస్ త్రో లో మహిళల ఆటలో Kamalpreet kaur పతకం సాధిస్తుందని అందరూ ఆశించారు. 64 మీటర్లకు డిస్కస్ త్రో విసిరి ఆమె ఫైనల్స్‌లో చోటు సంపాదించారు. ఆగష్టు 2న జరిగిన ఫైనల్స్‌లో కమల్‌ప్రీత్ 6వ స్థానంలో నిలిచారు.
షూటింగ్లో 15 మంది షూటర్లతో వెళ్లిన భారత బృందం కచ్చితంగా పతకాలు సాధిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఊహించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మను భాకర్, సౌరబ్ చౌధరిల జంట మిక్స్డ్ 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో తొలిదశలో మంచి ప్రదర్శన ఇచ్చింది. రెండో దశ క్వాలిఫైంగ్ రౌండ్లో మాత్రం వెనుదిరగాల్సి వచ్చింది. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ప్రపంచ నెంబర్ 2 సౌరభ్ ఛౌదరి ఫైనల్స్‌లోకి అడుగు పెట్టారు. అయితే తొలి మూడు స్థానాల్లో నిలవడంలో ఆయన విఫలమయ్యారు.
ఆర్చరీ రీకర్వ్ కేటగిరిలో ప్రపంచ నెంబర్ 1 గా కొనసాగుతున్న deepika kumari క్వార్టర్ ఫైనల్స్‌లో కొరియా క్రీడాకారిణి ఆన్ శాన్ చేతిలో వరుస రౌండ్ల లో ఒడిపోయారు. ఒలింపిక్స్ నుంచి ఇలా ఖాళీ చేతులతో వెనుదిరగడం ఆమెకిది మూడోసారి. 2016 రియో ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో ఆమె క్వార్టర్ ఫైన్స్లోనే ఒడిపోయారు. మరోవైపు ఆమె భర్త అతాను దాస్ కూడా జపాన్ కు చెందిన టకహారు పురుకావా చేతిలో ఓటమికి గురయ్యారు.
వరుస ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు ఇవే!
రియో ఒలింపిక్స్ (2016) ఒక రజతం, ఒక కాంస్యం
లండన్ ఒలింపిక్స్ (2012) రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు
బీజింగ్ ఒలింపిక్స్ (2008) ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి