marri chettu veru: సౌందర్యంలో రూపు రేకలు ఎంత కీలకమో, శిరోజాలు కూడా అంతే కీలకం. ఆ మాటకొస్తే, రూపు రేఖలు ఎంత బాగున్నా, శిరోజాలు ఊడిపోతే అదో పెద్ద లోపంగానే ఉంటుంది. అయితే జుట్టు తుట్టలు తుట్టలుగా ఊడిపోయే స్థితికి వచ్చేదాకా చాలా మంది ఆ విషయాన్నే పట్టించుకోరు. కారణం, ఎప్పుడో అద్దం ముందు నిలుచున్నప్పుడు ఆ లోటు తెలియడం తప్ప, జుట్టు ఊడిపోవడం తాలూకు ఇతర బాధలేమీ ఉండవు కదా!.
నిజానికి, జుట్టు రాలిపోకుండా కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మర్రి వేర్లు జుట్టు ఒత్తుగా పెరగడానికి, కుదురు బలపడటానికి తోడ్పడతాయి. పైగా, మర్రి వేర్లతో ఔషధాన్ని తయారు చేయడం, వాడుకోవడమూ తేలికే. 500 గ్రాముల మర్రిచెట్టు వేళ్ల (marri chettu veru)ను(ఊడలు) సేకరించి, వాటిని చిన్నగా సన్నని ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ముక్కలు బాగా ఎండాక వాటిని చూర్ణం చేయాలి. అలా తయారైన 250 గ్రాముల చూర్ణం తీసుకుని, కేజీ కొబ్బరి నూనెలో కలిపి, రోజూ ఎండలో పెట్టాలి. వారం తర్వాత ఆ మిశ్రమాన్ని వస్త్రంలో వడగట్టి ఒక పాత్రలోకి నూనె మొత్తం దిగేదాకా ఉంచాలి.
ఆ నూనెను రోజూ రాత్రిపూట పటుకునేటప్పుడు మాడుకు పట్టించాలి. ఇలా 6 మాసాలు వాడితే జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా ఎదుగుతుంది. ఆహారంలో కాల్షియం, జింక్, పొటాషియం, ఐరన్ ఉండేలా చూసుకోవాలి. రక్తహీనత,థైరాయిడ్ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి. ఆ సమస్యలన్నీ పరిష్కారమైతేనే ఈ ఔషధ తైలం సమర్థంగా పనిచేస్తుంది.