న‌క్స‌లైట్ల ఉద్య‌మ ఆశ‌యం నెర‌వేరేనా? (స్టోరీ) | Maoist Short Story in Telugu

0
96

న‌క్స‌లైట్ల ఉద్య‌మ ఆశ‌యం నెర‌వేరేనా? (స్టోరీ) | Maoist Short Story in Telugu

Maoist Short Story : న‌క్స‌లైట్ ఉద్య‌మం 53 సంవ‌త్స‌రాల సుదీర్ఘ పోరాటం. ఈ సుదీర్ఘ పోరాటం కోసం దేశంలో ఇప్ప‌టికీ కూడా దాదాపు 15,000 వేల మంది అయిన వారిని వ‌దిలి అడ‌వుల‌నే త‌మ ఇళ్లుగా చేసుకున్నారు. దోపిడీకి గుర‌య్యే బ‌డుగు వ‌ర్గాలే త‌మ బంధువులుగా క‌ష్టాల్లో ఉన్న‌వారే త‌మ స్నేహితులుగా భావించి వారికోసం పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్య‌మం చ‌ట్ట వ్య‌తిరేఖ‌మంటూ వంద‌లాది భ‌ద్ర‌తా ద‌ళాలు న‌క్స‌లైట్ల కోసం నిరంత‌రం అడ‌వుల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నాయి. విషాదం గొలిపే ఈ మ‌హాపోరాటంలో గ‌డిచిన 23 సంవ‌త్స‌రాల్లో దాదాపుగా 12,000 వేల‌కు పైగా అసువులు బాశారు.

మ‌నం అప్పుడ‌ప్పుడు, ప్ర‌స్తుతం కూడా పోలీసులు, న‌క్స‌ల్స్‌కు మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎన్‌కౌంట‌ర్‌లో ప‌లానా పోలీసులు చ‌నిపోయార‌నో లేదా ఇంత మంది న‌క్స‌ల్స్ చ‌నిపోయార‌నో వార్త‌ల్లో చ‌దువుతుంటాం. పోలీసులు న‌క్స‌ల్స్ ను చంపిన‌ప్పుడు అయ్యో పాపం న‌క్స‌ల్స్ అని, న‌క్స‌ల్స్ పోలీసుల‌ను చంపిన‌ప్పుడు అయ్యో పాపం పోలీసుల‌ని బాధ‌ప‌డుతుంటాం. అయితే వాస్త‌వానికి అస‌లు ఎవ‌రు? ఈ న‌క్స‌ల్స్‌? . వారు ఎందుకు ప్ర‌జాభీష్టం మేర‌కు ఎన్నిక కాపాడిన ప్ర‌భుత్వాల మీద పోరాటం చేస్తున్నారు. అస‌లు న‌క్స‌లైట్ ఉద్య‌మం అంటే ఏమిటి? వారు ఎందుకు పోరాడుతున్నారు? అస‌లు పోరాటం ఎప్పుడు ప్రారంభ‌మైంది? దేశానికి న‌క్స‌ల్స్ పోరాటం లాభ‌మా? న‌ష్ట‌మా? .

ఉద్య‌మం ఎవ‌రికి ఉప‌యోగం?

ఎవ‌రి బ్ర‌తుకు వారిదైన ఈ ఆధునిక యుగంలో కూడా న‌క్స‌లైట్ల ఉద్య‌మాన్ని ఇప్ప‌టికీ ఎందుకు కొన‌సాగిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వాలు అత్యంత క్లిష్ట‌మైన స‌మ‌స్య‌గా భావిస్తున్న ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏమిటి? హృద‌యాలు భీతిచెందేంత‌గా హింస‌కు కార‌ణ‌మ‌వుతున్న ఈ పోరాటానికి అంతం ఎప్పుడు? అనే విష‌యాలు బ‌హుశా చాలా మందికి తెలియ‌వు. న‌క్స‌లైట్ల ఉద్య‌మం గురించి తెలుసుకోవాల‌నుకుంటే అస‌లు స్టోరీలోకి(Maoist Story) వెళ‌దాం!.

ఈ విప్ల‌వ జ్వాల‌లు ఎలా వ‌చ్చాయంటే? ఎర్ర‌బారిన తూర్పు క‌నుమ‌ల వైపు చూడ‌మ‌న్నాడు ఓ క‌వి. న‌క్స‌ల్స్ ఉద్య‌మం మొట్ట‌మొద‌ట‌గా 1967 సంవ‌త్స‌రం మే నెల 25వ తేదీన ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో న‌క్స‌ల్ బ‌రి అనే చిన్న గ్రామంలో ప్రారంభ‌మైంది. ఆ గ్రామం పేరుమీద‌నే న‌క్స‌లైట్లు అనే పేరు వ‌చ్చింది. న‌క్స‌ల్ బ‌రి ఉద్య‌మ స్ఫూర్తితో సాయుధ పోరాటం చేసేవారిని న‌క్స‌లైట్లు అని పిలుస్తున్నారు. స్వాతంత్య్ర అనంత‌రం దాదాపుగా దేశంలోని అన్ని గ్రామాల్లో వ్య‌వ‌సాయ భూముల‌న్నీ కొంత మంది భూస్వాముల చేతిలోకి వెళ్లాయి. ఈ భూస్వాములు రైతుల శ్ర‌మ‌ను దోపిడీ చేసేవారు.

న‌క్స‌ల్స్ నినాదం (Maoist Story) ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటి?

భూస్వాములు లేదా జ‌మీందార్ల భూముల్లో ఆ గ్రామాల్లోని అట్ట‌డుగు వ‌ర్గాలు, రైతులు ఆరుగాలం శ్ర‌మించి పంట‌లు పండించే వారు. కానీ ఆ పంట‌ల్లో వారికి ఎటువంటి భాగం ఉండేది కాదు. చాలా చోట్ల వెట్టి చాకిరి చేయించేవారు. అంటే జ‌మిందార్ల పొలాల్లో ప‌నిచేసే రైతుల కుటుంబాల‌కు ప్ర‌తిఫ‌లంగా కొద్దిపాటి ఆహారం మాత్ర‌మే పెట్టేవారు. కానీ కూలీ ఇచ్చేవారు కాదు. దీని వ‌ల్ల దేశంలో అధిక సంఖ్యాకులైన రైతులు వారి జీవితాల్లో ఎటువంటి ఎదుగుద‌ల ఉండేది కాదు. ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో న‌క్స‌ల్ బ‌రి అనే గ్రామంలో తిరుగుబాటు మొద‌లైంది. భూమి కోసం ..భుక్తి కోసం.. విముక్తి కోసం.. అనే నినాదంతో న‌క్స‌ల్‌బ‌రి అనే గ్రామంలోని సంతాల్ తెగ‌కు (Santal Tribe ) చెందిన గిరిజ‌నులు 1967 మార్చి 3వ తేదీన అక్క‌డ భూస్వామికి చెందిన పంట పొలాల‌ను ఆక్ర‌మించుకున్నారు. అందులో ఎర్ర జెండాల‌ను పాతారు. పంట‌ను స్వాధీనం చేసుకున్నారు.

Latest Post  West Godavari Sub Inspectors: 10 మంది ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం.. ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ

ఈ సంఘ‌ట‌న‌తో దేశంలోని చాలా ప్రాంతాల్లో అల‌జ‌డి మొద‌లైంది. రెండు శ‌తాబ్ధాల‌కు పైగా బ్రిటీష్ వారి వ‌ల‌స పాల‌న‌లో చేతిలో ఆ త‌ర్వాత రెండు ద‌శాబ్ధాలుగా భూ స్వాముల చేతిలో దోపిడీకి గురైన నేక‌మంది రైతులు చైత‌న్యం పొందారు. 1967 ఏప్రిల్ నెల క‌ల్లా ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దాదాపుగా 60 చోట్ల భూ పోరాటాలు జ‌రిగాయి. రైతులు సంఘ‌టిత‌మై భూస్వాముల వ‌ద్ద ఉన్న భూముల‌ను స్వాధీనం చేసుకున్నారు. భూ స్వాముల వ‌ద్ద ఉన్న భూ యాజ‌మాన్య ప‌త్రాల‌ను త‌గుల‌పెట్టారు.

Charu Mazumdar నేతృత్వంలోని సిపిఐ ఎంఎల్ పార్టీ భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం రైతులు సాయుధ పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చింది. Charu Mazumdar పిలుపును అందుకొని దేశంలో భూస్వాముల ఆగ‌డాల‌కు బ‌లౌవుతున్న రైతులంద‌రూ సంఘ‌టిత‌మై భూ పోరాటాలు ఆరంభించారు. రైతుల్లో వెల్లువిరిస్తున్న విప్ల‌వ చైత‌న్యంతో భూస్వాముల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. విప్లవ బాట ప‌డుతున్న రైతుల‌ను ఎలాగైనా అణ‌గ‌దొక్కాల‌ని, భూ స్వాములు కుట్ర‌లు, కుతంత్రాలు చేయ‌సాగారు. పంచాయ‌తీక‌ని పిలిచి న‌క్స‌ల్‌బ‌రి(Maoist Story) అనే గ్రామంలో భూస్వామి ఓ గిరిజ‌న యువ‌కుడుని దారుణంగా కొట్టించాడు. ఆ మ‌రునాడే శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు వ‌చ్చిన ఓ పోలీసు ఆఫీస‌ర్ భూస్వాముల కొమ్ము కాస్తున్నాడ‌నే నెపంతో గిరిజ‌నులు అత‌న్ని బాణాల‌తో హ‌త‌మ‌ర్చారు.

ర‌క్త‌పుటేరుగా మారిన న‌క్స‌ల్ బ‌రి ఉద్య‌మం!

ఆ మ‌రునాడు అన‌గా 1967వ సంవ‌త్స‌రం మే 25న న‌క్స‌ల్‌బ‌రి గ్రామంలో పోలీసులు ప్ర‌తీకార చ‌ర్య‌గా జ‌రిపిన కాల్పుల్లో 11 మంది గిరిజ‌నులు చ‌నిపోయారు. అప్పుడు పునాది ప‌డిన ర‌క్త‌పుటేరు నేటికి ప్ర‌వ‌హిస్తూనే ఉంది. Charu Mazumdar భావాల‌కు ఆక‌ర్షితులైన కొంద‌రు విప్ల‌వ బాట ప‌ట్టారు. న‌క్స‌లైట్లు అజ్ఞాతంలో జీవ‌నం గ‌డుపుతూ, దేశంలో 100 ఎక‌రాల భూములు గ‌ల భూస్వాముల‌పై తిరుగుబాటు చేసి వారి భూముల‌ను రైతుల‌కు పంచేవారు. న‌క్స‌లైట్ల ప్ర‌భావం వ‌ల్ల గ్రామాల్లో ప్ర‌జ‌ల జీవ‌న విధానంలో చాలా మార్పులు వ‌చ్చాయి. అగ్ర‌వ‌ర్ణాలకు చెందిన ప్ర‌జ‌ల ముందు సామాన్య ప్ర‌జ‌లు చెప్పులు తొడుక్కోకూడ‌దు. పంచ పైకి క‌ట్ట‌కూడ‌దు. వారు దారిలో వెళ్లే ట‌ప్పుడు అంద‌రూ లేచి నిల‌బ‌డాలి లాంటి అమానుష చ‌ర్య‌లు ఆగిపోయాయి.

న‌క్స‌లైట్ల భ‌యంతో చాలా వ‌ర‌కు దోపిడీ మ‌రియు పీడ‌న త‌గ్గింది. న‌క్స‌లైట్లు ప్ర‌జాకోర్టును నిర్వ‌హించి, త‌ప్పు చేసిన వారిని గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేయ‌డ‌మో లేదా హ‌త‌మార్చ‌డ‌మో చేసేవారు. కొన్ని స్టూండెంట్స్ ఆర్గ‌నైజేష‌న్‌లో న‌క్స‌లైట్లు త‌మ ప్ర‌భ‌ల్యాన్ని పెంచుకున్నారు. పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు త‌మ చ‌దువును విడిచిపెట్టి ఉద్య‌మ కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకున్నారు. Charu Mazumdar సాయుధ పోరాటం గ్రామ‌, గిరిజ‌నుల్లోనే కాదు..అంత‌టా ఏక‌కాలంలో ఉద్భ‌వించాల‌ని ప్ర‌క‌టించారు.

Latest Post  Bijapur SI Kidnap | కిడ్నాప్ అయిన SI హ‌త్య‌! లేఖ వ‌దిలిన Maoistలు

ఈ విధంగా ఉద్య‌మ కారులు వ‌ర్గ‌శ‌త్రువులైన వ్య‌క్తుల‌ను హ‌త‌మార్చాల‌నే విధంగా పోరాటం చేశారు. ఈ క్ర‌మంలో భూస్వాముల‌నే కాకుండా విశ్వ‌విద్యాల‌య బోధ‌కులు, పోలీసు అధికారులు, నాయ‌కులు త‌దిత‌ర అధికారుపై కూడా పోరాటాన్ని ప్ర‌యోగించ‌డం ప్రారంబించారు. న‌క్స‌లైట్లు త‌మ పోరాటం కోసం తుపాకు ల‌ను త‌యారు చేయ‌డం కూడా నేర్చుకున్నారు. అప్ప‌టి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి Siddharatha Shankar Ray న‌క్స‌లైట్ల‌కు వ్య‌తిరేకంగా క‌ఠిన‌మైన ప్ర‌తిచ‌ర్య‌లు ప్రారంభించారు. దీంతో ఉద్య‌మంలో అంతర్గ‌త క‌ల‌హాలు ప్రారంభ‌మ‌య్యాయి. పెద్ద ఎత్తున స‌భ్యులు Charu Mazumdar పోరాట శైలిని ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు.

Charu Mazumdar పోరాటంపై తిరుగుబాటు!

Charu Mazumdar నాయ‌క‌త్వానికి వ్య‌తిరేకంగా స‌త్య‌నారాయ‌ణ సింగ్ తిర‌గ‌బ‌డ‌టంతో 1971లో సీపీఐఎంఎల్ పార్టీ రెండుగా చీలింది. 1972లో పోలీసు ద‌ళాలు Charu Mazumdarను బంధించి హింసించి చంపాయి. చారు మంజుందార్ మ‌ర‌ణం త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్ లో న‌క్స‌లైట్ల ఉద్య‌మం అణిచి వేయ‌బ‌డింది. కానీ ఇత‌ర రాష్ట్రాల్లో ఈ పోరాటం విజృంభించింది. ప్ర‌స్తుతం నక్స‌లైట్ల ప్ర‌భావం దేశంలోని 12 రాష్ట్రాల్లోని 118 జిల్లాల్లో ఉంది. న‌క్స‌లైట్ ఉద్య‌మం తెలుగు ప్రాంతంలో మొద‌ట‌గా శ్రీ‌కాకుళం జిల్లాలో మొద‌లైంది. శ్రీ‌కాకుళం రైతాంగ పోరాటం దాదాపుగా న‌క్స‌ల్‌బ‌రికి స‌మాతరంగా జ‌రిగింది.

షావుకారులు, భూస్వామ్య వ‌ర్గాల‌కు వ్య‌తిరేకంగా గిరిజ‌న రైతాంగం తీవ్ర పోరాటం చేసింది. ఈ పోరాటానికి మైదానం ప్రాంతం నుండి ఎంతో మంది మేధావులు వెళ్లి ప్రాణ‌త్యాగం చేశారు. ఆ ఉద్య‌మం ఫ‌లితంగానే అప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి రక్ష‌ణ లేని గిరిజ‌నుల అభివృద్ధికి integrated tribal development agency ప్ర‌భుత్వం ప్రారంభించింది. గిరిజ‌నుల భూములు అన్యాక్రాంతం కాకుండా 1/70 act చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా గోదావ‌రి లోయ‌లోని వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదారి జిల్లాల్లో ఆదివాసీల‌కు దాదాపు 3 ల‌క్ష‌ల ఎక‌రాల భూముల‌ను పంచి ఇచ్చారంటూ న‌క్స‌లైట్లు త‌మ నివేదిక‌లో తెలియ‌జేశారు.

త‌ర్వాత ఈ ఉద్య‌మం ఉత్త‌ర తెలంగాణ‌కు విస్త‌రించింది. తెలంగాణ‌లోని కొన్ని గ్రామాల్లో దొర‌ల‌ను గాడిద‌ల మీద ఊరేగిస్తే, మ‌రికొన్ని గ్రామాల్లో దొర‌ల‌కు సాంఘీక బ‌హిష్క‌ర‌ణ‌లు చేశారు. ఇదో సామూహిక ప్ర‌జా ఉద్య‌మం. వివిధ కులాల వారు వెట్టికి స్వ‌స్తి ప‌లికాయి. మాల‌, మాదిగ కులాల వారు కూలీ ఇవ్వ‌క‌పోతే ప‌నుల‌కు రామంటూ తెగేసి చెప్పారు. భూస్వాములు అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న భూముల్లో ఎర్ర జెండాల‌ను పాతి ఆ భూముల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లు క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక ఉప్పెన‌లా సాగింది. దీంతో భ‌య‌ప‌డి చాలా మంది భూస్వాములు గ్రామాల‌ను వ‌దిలి పారిపోయారు.

Latest Post  no cow milk: సార్ నా గేదె పాలు ఇవ్వ‌డం లేదు! కంప్లెంట్ తీసుకోండి!

తెలుగు రాష్ట్రాల్లో ఉద్య‌మం తేడా ఏమిటి?

అయితే న‌క్స‌ల్‌బ‌రి శ్రీ‌కాకుళం, ఉత్త‌ర తెలంగాణ‌లో ఉద్య‌మాల‌కు మౌలిక తేడా ఉంది. న‌క్స‌ల్‌బ‌రి ఉద్య‌మంలో భాగంగా శ్రీ‌కాకుళంలో గిరిజ‌నుల పోరాటంగా పేరుగాంచింది. ఉత్త‌ర తెలంగాణ‌లో మాత్రం రైతుల పోరాటంగా వెలుగులోకి వ‌చ్చింది. సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ రంగాల్లో అనేక మార్పుల‌కు నాంది ప‌లికిన న‌క్స‌లైట్లు 1985లో త‌మ ఉద్య‌మాన్ని పీపుల్స్ వార్‌గా మార్చుకున్నారు. త‌ర్వాత 2004లో అనేక చీలిక‌లుగా ఉన్న న‌క్స‌లైట్లు ఏక‌మై మావోయిస్టులుగా పేరు మార్చుకున్నారు. ఇప్ప‌టికీ 53 సంవ‌త్స‌రాలు దాటిన ఈ సుదీర్ఘ పోరాటంలో అనేక ర‌క్త‌పుటేరులై పారాయి. ఈ పోరాటంలో వేల సంఖ్య‌లో విప్ల‌వ‌కారులు, పోలీసులు, బ‌ల‌గాలు, అధికారులు, ప్రజా ప్ర‌తినిధులు అశువులు భాశారు. పాకిస్థాన్ ప్రేరేపిత టెర్ర‌రిస్టుల మాదిరిగానే వీరిని కూడా ఆయుధాల‌తో అణిచి వేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం చూస్తోంది. కానీ జీహాద్ పేరుతో మ‌త్మోనాదంతో నిండిన ఉగ్ర‌వాదులు వేరు. పేద గిరిజ‌న, ఆదివాసీల కోసం ప్రాణాలు అర్పించిన న‌క్స‌లైట్లు వేరు.

అంద‌ర్నీ ఒకే గాటున క‌ట్టేయడం పొర‌పాటే అవుతుంది. అయితే అమాయ‌మైన ప్ర‌జ‌ల ప్రాణాలు తీసే ఉగ్ర‌వాదుల వ‌లే న‌క్స‌ల్స్ కూడా హింస‌కు పాల్ప‌డం సామాన్య జ‌నాల‌కు స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం తో సానుభూతిని లేకుండా చేస్తుంది. 50 ఏళ్లుగా జ‌నం కోసం పోరాడుతున్న న‌క్స‌లైట్లు అదే జ‌నంలోని కొంద‌ర్నీ ఇన్‌ఫార్ల్మంటూ కాల్చేయ‌డం, పోలీసుల‌ను గెరిల్లా ప‌ద్ధ‌తుల్లో బ‌లి తీసుకోవ‌డం, ‌ప్ర‌భుత్వ ఆస్తుల‌‌ను ధ్వంసం చేస్తూ, అభివృద్ధిని నిరోధిస్తూ త‌ద్వారా వారికి అడ్డుగా మార‌డం ఇవ్వ‌న్నీ న‌క్స‌లైట్ల ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న గౌర‌వం, సానుభూతిని త‌గ్గించింది. ఏది ఏమైన‌ప్ప‌టికీ న‌క్స‌ల్స్ వ‌ల్ల దేశంలో పేద గిరిజ‌న‌, ఆదివాసీ, ద‌ళిత జాతుల‌కు మేలు జ‌రిగిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో మారుతున్న జీవ‌న‌శైలిలో వారి పోరాటం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండి చేస్తే ఎంతో మేలు ఉంటుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు, సామాజిక నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇక‌నైనా ర‌క్త‌పాతం విధానం మాని, శాంతియుత వాతావ‌ర‌ణంలో దేశ అభివృద్ధికి పాటుప‌డితే బాగుంటుంద‌ని ప్ర‌స్తుతం జ‌రిగిన ఇటీవ‌ల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here