Mangli Singing in Isha Foundation | మహా శివరాత్రి సందర్భంగా ఈషా ఫౌండేషన్ లో జరిగిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగ్లీతో పాటు ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ పాటలతో అలరించారు. సింగర్ మంగ్లీ పాడిన సాధు జంగమా ఆది రూపుడా… మహా శివరాత్రి పాటతో భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. మంగ్లీ పాడుతున్న సమయంలో ఆనందంగా కేరింతలు కొడుతూ, నృత్యాలు (Mangli Singing in Isha Foundation) చేశారు.
సద్గురు కూడా మంగ్లీ పాటకు మంత్రముగ్థులయ్యారు. ఇషా పౌండేషన్లో జరిగే మహాశివరాత్రి వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగ్లీ పాడే సమయంలో పెద్ద పెద్ద డ్రమ్ములతో వాయిద్యాలు చేశారు. సద్గురు భక్తులను అనుసరిస్తూ భక్తి పరవశంలో మంగ్లీ పాటకు స్టెప్పులు వేశారు. ఈషా ఫౌండేషన్లో మహాశివరాత్రి వేడుకలు మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకూ జరిగాయి. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా శివుడు భక్తులు, పెద్ద పెద్ద సెలబ్రటీలు పాల్గొన్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పెద్ద పెద్ద వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం ఈ ఏడాది నుండి ప్రారంభమయ్యాయి.

- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!