Mangli Shivaratri Song 2022 mp3 Download | నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో అంటూ మహా శివరాత్రి 2022 సాంగ్‌తో సింగర్ మంగ్లీ ఈ ఏడాది మన ముందుకు వచ్చారు. శివరాత్రి సందర్భంగా మంగ్లీ స్వరంతో పాట వింటేనే అది శివరాత్రిలాగా ఉంటుందనే అభిమానులు, భక్తులు లేకపోలేదు. మిట్టపల్లి సురేందర్ చేతిలో రాసిన లిరిక్స్‌ను మంగ్లీ తన స్వరాలను అందించి పాటకు జీవం పోసి శివుడి భక్తిని చాటి చెప్పారు. ఈ పాటను ఇప్పటికే లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు.
మహాశివరాత్రి సందర్భంగా శివ భక్తిని స్మరిస్తూ ఈ సృష్టిలో శివుడి ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు అన్నట్టుగా మంచి పదపొందికతో పాటను రాశాను. ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో విశ్వమైనా భస్మమైనా నీవే అంటూ శివుడుని ఆరాధించడం అద్భుతంగా ఉంది. నింగి, నేల, గాలి, నిప్పు సమస్త జీవ మానవకోటిని ఏకం చేస్తూ ప్రతి అణవణువులో శివుడి నామస్మరాన్ని పలికించేలా నీవే ఆధారం ఈ జగతికి అనే విధంగా చాలా స్పష్టంగా చూపించారు.
ఈ సృష్టిలో ఆగిపోని కాలమందు అల్లుతావు బంధం, ఆగిపోయే ఊపిరినిచ్చి తెంచేవు ప్రాణం, యాడవుండి ఆడుతావు ఇంత వింత ఆట అంటూ మానవుని బ్రతుకు విషయమై శివుడి భక్తులకు ఎంత దగ్గరగా ఉంటాడో, లోకాన్ని ఎలా ఏలుతున్నాడో పాటలో ప్రతి అర్థం భక్తులను ఆలోచించే విధంగా చేశాయి. మొత్తంగా ఈ పాటతో ఈ ఏడాది శివరాత్రి మారుమ్రోగే అవకాశం ఉంది. ఇంత చక్కటి పాటలను అందిస్తున్న మంగ్లీకి అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ పాట వింటుంటే సాక్షాత్తు ఆ పరమ శివుణ్ణి చూసినట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు.
మహాశివరాత్రి వస్తుందంటేనే మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటామని ఆమె పాట అంటే అంత ఇష్టమని మంగ్లీని పొగుడుతున్నారు. మంగ్లీ గొంతులో ఏదో మహిహ ఉందని, పరమశివుడే మీ గానమృత అభిషేకానికి పరవశించి తాండవం చేసేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే మంగ్లీ అఫిషియల్ నుండి విడుదలైన ఈ పాటను ఎంతో మంది చూశారు. మీరు కూడా ఒకసారి పాటను చూడండి.
Mangli Shivaratri Song 2022 mp3 Download
Song Name: Needi kaani Rupamedi ledu
Director: Damu Reddy
Lyrics: Mittapelli Surender
Singer: Mangli
Music: Suresh Bobbilli
DOP: Tirupathi
Editing: Uday Kumbham
Classical Dancer: Hari Prasad
Asst. Editor: Ashok Karri
Asst. Camera: Paramesh
Poster: Mittu Aretty
Art Department: Nagaraju & Manohar
DI: Sanjeev (Rainbow Post)
Sponsored by: Manikanta Rathod
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!