Mangli Real life story: యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు ఇండిపెండెంట్ సింగర్ మంగ్లీ. మంగ్లీ అంటే టక్కున గుర్తొచ్చేది హుషారైన ఆటపాటలు. ఉర్రూతలూగించే పాటలు, మైమరపించే భక్తి గేయాలు. 1994 జూన్ 10న అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తాండలోని జన్మించిన మంగ్లీ అసలు పేరు ముడావత్ సత్యవతి రాథోడ్. ఈమే ఒక పేద బంజారా కుటుంబం నుంచి వచ్చారు. టివీ యాంకర్‌గా కెరియర్ ప్రారంభించి ఆ తరువాత జానపద గాయనిగా పాపులర్ (Mangli Real life story)అయ్యింది.

రాయలసీమలో పుట్టి!
తాండలోనే 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గర్ల్స్ హైస్కూల్లో చదివారు. మంగ్లీకి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. వారిలో ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. తొలుత రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (Vicente ferrer rural development trust)ద్వారా చదువుకుంటూ పాటలు పాడటం నేర్చుకున్నారు. అదే సంస్థ సహకారంతో తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. వారి ఆర్థిక సహాయంతోనే 10వ తరగతి తర్వాత ఎస్పీ వర్సిటీలో మ్యూజిక్ అండ్ డాన్స్ డిప్లోమా కోర్సులో చేరారు.

తెలంగాణ అమ్మాయిగా!
అనంతరం కెరియర్ మొదలు పెట్టి తెలంగాణలో పల్లెపాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మొదట జానపద గీతాలతో కెరియర్ ప్రారంభించిన మంగ్లీ తీన్మార్ ప్రోగ్రాంతో జనాలకు మరింత చేరువయ్యారు. మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు. తీన్మార్ మల్లన్న కార్యక్రమంలో మంగ్లీ పేరు తెలంగాణలోని గడప గడపకీ చేరింది. బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ పండుగల్లో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ(Love story) చిత్రంలో మంగ్లీ పాడిన సారంగ దరియా విస్తృత ప్రజాదరణ పొందింది. మహా శివరాత్రి సందర్భంగా సద్గురు సమక్షంలో భక్తిగీతాన్ని ఆలపించిన మంగ్లీ, సొంత డబ్బుతో తన ఊరిలో గుడి కట్టించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!