Manginapudi Beach: ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్టిన పోలీసులు! యువ‌కుడు సేఫ్‌!

Andhra Pradesh
Share link

Manginapudi Beach: కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం లోని మంగిన‌పూడి బీచ్‌లో ఓ యువ‌కుడు అనుమాన‌స్ప‌దంగా తిరుగుతున్నాడు. అల‌ల‌వైపు చూస్తూ ఏదో చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇదంతా మంగిన‌పూడి చీచ్‌లో గ‌స్తీ కాస్తున్న Marine Police లు గ‌మ‌నిస్తున్నారు. యువ‌కుడు ఏం చేస్తాడోన‌ని దూరంగా ప‌రిశీలిస్తున్నారు. ఇక దగ్గ‌ర‌కు వెళ్లి అడిగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌లో ఆ యువ‌కుడు స‌ముద్రంలో దూకాడు. ఆత్మ‌హ‌త్య చేసుకోబోయాడు.

ఒక్క ప‌రుగున మెరైన్ పోలీసులు యువ‌కుడిని ప‌ట్టుకున్నారు. స‌ముద్రం తీరంలో నుండి ప‌ట్టుకుని ఒడ్డుకు చేర్చారు. ఆత్మ‌హ‌త్య చేసుకోబోయిన యువ‌కుడుని పోలీసులు కూర్చోపెట్టి ఆరా తీశారు. తాను విజ‌య‌వాడ వ‌న్‌టౌన్ కు చెందిన కొత్త‌మాసు అఖిల్‌గా పేర్కొన్నాడు. విజ‌య‌వాడ‌లో ఓ Medical షాపులో ప‌నిచేస్తున్నాడు Akhil.

Manginapudi Beach: వారంలో రెండు సార్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

విజ‌య‌వాడ‌కు చెందిన కొత్త‌మాసు అఖిల్ గ‌త వారం కింద‌ట కూడా ఆత్మ‌హ‌త్యాయ‌త్నంకు పాల్ప‌డి విఫ‌ల‌మ‌య్యాడు. మళ్లీ ఇప్పుడు Manginapudi Beach లో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. సుమారు 100 అడుగుల దూరంలో నీళ్ల‌లో కొట్టుకుంటున్న అఖిల్ ను గుర్తించిన పోలీసులు చాక‌చ‌క్యంగా కాపాడారు. ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకోబోయావ‌ని యువ‌కుడిని ఆరా తీయ‌గా జీవితం మీద విర‌క్తి క‌ల‌గ‌డంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు తెలిపారు. మంగిన‌పూడి బీచ్‌లో అప‌స్మార‌క స్తితిలో చేరుకున్న అఖిల్‌ను చికిత్స నిమిత్తం బంద‌రు ప్రభుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

See also  AP Half Day School Timings 2022 Table:ఏపీలో ఒంటిపూట బ‌డుల స‌మ‌యం

Leave a Reply

Your email address will not be published.