Mangalagiri MRO: అతను మండల కేంద్రానికి ముఖ్య అధికారి, ఇటీవల Gold Medal కూడా అందుకున్నారు. కానీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో సమన్లు అందు కుని వార్తల్లోకెక్కారు. ఆ అధికారే గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మార్వో. వివరాల్లోకి వెళితే..
విధి నిర్వహణలో అలసత్వంకు గానూ..
విధి నిర్వహణలో అలసత్వం వహించిన మంగళగిరి ఎమ్మార్వో (Mangalagiri MRO)కు ఉన్నతాధికారులు సమన్లు జారీ చేశారు. పలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన ఆ అధికారి చేయాల్సిన విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తోంది. దీంతో సేవా కార్యక్రమాలకు గోల్డు మెడల్ రాగా, విధుల నిర్లక్ష్యానికి సమన్లు అందుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
బీసీ-ఈ సర్టిఫికెట్ కొరకు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారట. మహమ్మద్‌లకు BC-E సర్టిఫికెట్ జారీ చేయడం కుదరదని ఎమ్మార్కో దరఖాస్తును తిరస్కరించారట. దీంతో బాధితుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్‌ను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న కమిషన్ తమ ఎదుట హాజరు కావాలని ఎమ్మార్కోకు నోటీసు జారీ చేశారు.
అయితే హాజరు సమయంలో సమస్య పరిష్కరిస్తానని నెల రోజుల వెంబడి కావాలని కమిషన్ ఛైర్మన్‌ను ఎంఆర్ఓ (Mangalagiri MRO) కోరారు. గడువు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన ఎమ్మార్వోకు ఈ నెల 15న కమిషన్ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేశారు మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.ఇక్బాల్ అహ్మద్ ఖాన్.