Mangal Chandika | కుటుంబం చల్లగా వర్థిల్లాలంటే శుభప్రదంగా పుత్ర పాత్రాభివృద్ధి జరగాలంటే మంగళ చండీ పూజ చేయడం మేలంటోంది. దేవీ భాగవతం తొమ్మిదో స్కంధంలోని ఈ కథాంశం. ఇంతకీ ఎవరీ మంగళ చండీ? ఈ తల్లిని కేవలం స్త్రీలేనా పూజించేది? పురుషులు కూడా పూజించవచ్చా? అనే అంశాలను గురించి ఈ కథాంశం వివరిస్తోంది. మంగళచండీ(Mangala Chandi) మాత ఎవరో కాదు. అక్షరాల దుర్గ మూల ప్రకృతి. కొద్దిపాటి మూర్తి బేధంతో ఆ దుర్గామాతే ఇలా వెలిసి, కృపారూపిణియై స్త్రీలకు ఇష్టదేవతైంది. కల్యాణాలు, కుటుంబపరంగా మంగళ కావ్యాల్లాంటి శుభాలన్నీ అనుగ్రహించటంలో ఈ తల్లి ముందుంటుంది. మంగళాలు కలిగిస్తుంది కనుక మంగళ చండీ అన్నారు. అలాగే మను వంశంలో పుట్టిన మంగళ మహారాజు ఈ తల్లిని ఆరాధించి సప్త ద్వీపాలకు అధిపతి అయ్యాడు. మంగళుడిని అనుగ్రహించిన కారణంగా అలా మంగళచండి అనే పేరొచ్చింది. ఇంకా ఇదే తీరులో ఈ తల్లికి ఈ పేర్లు స్థిరపడటానికి ఎన్నెన్నో శుభ ఉదాహరణలున్నాయి.
తొలి పూజలు చేసిందెవరు?
ఈ మంగళచండీ(Mangal Chandika) మాతకు తొలిగా పూజలు చేసి మేలు పొందింది ఎవరంటే సాక్షాత్తూ ఆ శివుడే. శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుడితో యుద్ధం చేసేటప్పుడు రాక్షాసుడు వేసిన శస్త్రాల ధాటికి ముక్కంటి రథం తట్టుకోలేక పోయింది. ఆ యుద్ధంలో విజయం కలగాలంటే మంగళచండీ పూజ చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు శివుడికి చెప్పాడు. అప్పుడు శివుడు చేసిన పూజవల్ల మంగళచండి ప్రత్యక్షమైంది. ఆకాశం నుంచి శివుడి రథం నేల మీదకు పడిపోకుండా ఆమె అభయమిచ్చి అడ్డుకుంది. ఆ అభయంతో శ్తిని పుంజుకున్న శంకరుడు వెంటనే విష్ణుమూర్తి అందించిన శరాన్ని అందుకొని, దాంతో అసుర సంహారం చేశాడు. అలా విజయం పొందగానే శంకరుడు మళ్లీ శుభ్రంగా స్నానం చేసి దౌత వస్త్రాలు ధరించి మంగళచండీ పూజను శ్రద్ధతో చేశాడు.
మంగళ కలశం పెట్టి ఆ కలశంలోని అమ్మ వారిని ఆవాహన చేసి షోడశోపచారాలతో, నృత్యగీతాదులతో మహా నైవేద్యాలను సమర్పిస్తూ ఆనాడాయన పూజలర్పించాడు. ప్రత్యేకించి అమ్మవారి మూల మంత్రాన్ని జపిస్తూ స్తోత్రం చేస్తూ పూజలర్పించాడు. కేవలం ఆ రోజుతో ఊరుకోకుండా ఆ తర్వాత ప్రతి మంగళవారం నాడు మంగళచండీ పూజను చెయ్యటం ఓ నియమంగా పెట్టుకున్నాడు. ఆ నీలకంఠుడు. అలా ఆయన మంగలఛండికి మొదటి పూజ చేసి మేలు పొందినవాడయ్యాడు.
ఆ సోత్రాన్ని విన్నా శుభమే
అంగారక గ్రహాన్ని మంగళుడు అని అంటారు. ఆ మంగళుడు శివుడి తర్వాత మంగళచండికి పూజ చేసి మేలు పొందాడు. అనంతరం ప్రతి మంగళవారం నాడు దేవతా స్త్రీలు ఈ పూజ చేయడం ప్రారంభించారు. వారి తర్వాత మానవ లోకంలోని స్త్రీలంతా మంగళచండీ పూజ చేస్తూ చక్కటి సంతానాన్ని, సౌభాగ్యాన్ని సమృద్ధిగా పొందుతూ కుటుంబం మంగళప్రదంగా కళకళాడుతూ ఉండేలా ఆ తల్లి అనుగ్రహం పొందుతూ వస్తున్నారు. ఈ తల్లి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆమెకు సంబంధించిన మూలమంత్రాన్ని, శివుడు ఆ అమ్మను గురించి చేసిన దివ్యస్తోత్రాన్ని పరించటం మేలంటోది దేవీ భాగవతం.
శివుడు చెప్పిన ఆ స్తోత్రాన్ని విన్నా, చదివినా సకల శుభాలు కలుగుతాయని, పుత్రపత్రాభివృద్ధితో ఇల్లు విలసిల్లతుందని, శాంతి నిలయమవుతుందని పెద్దలు చెబుతున్న మాట. మూలమంత్రం, స్తోత్రాలను పెద్దల నుంచి జాగ్రత్తగా చెప్పించుకొని తప్పుల్లేకుండా జపించాలని గురువులు చెబుతున్నారు.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?