Jaggayyapeta నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన Manda Krishna Madiga

Manda Krishna Madiga | NTR జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌ నియోజకవర్గం Peddamodugu palli గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం,బాబు జగజ్జివన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో MRPS అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ముఖ్య అతిథులుగా సోమ‌వారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగతో పాటు ఏపీ ప్ర‌భుత్వ Whip, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను హాజ‌రై మాట్లాడారు.

Ambedkar అంటే ఒక చైతన్యం అని, బడుగు బలహీన వర్గాల నుంచి అగ్రవర్ణాల వరకు దేశంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు తన అక్షరం తో స్వేచ్ఛ‌ను కల్పించిన మహనీయులు అని కొనియాడారు. తరతరాలుగా సమాజంలో పీడిత భాదిత ప్రజలకు అండగా నిలిచిన శక్తి అని, మన దేశంలో ప్రతి పౌరుడు ఈరోజు అనుభవిస్తున్న హక్కులు అంబేద్కర్ ఇచ్చిన వరాలు అని పేర్కొన్నారు. 1927 లో అంబేద్కర్ బహిస్కృత భారతి అని ఒక్క వ్యాసం వ్రాసారని అందులో ఆయన తిలక్ కనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే స్వాతంత్య్రం నా జన్మ హక్కు అనే నినాదానికి బదులుగా అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మహక్కు అని ప్రకటించేవారని తెలిపారు.

అంటే ఆయన మాటలో అంటరానితనం వల్ల ఆయన పడిన బాధ‌ను మనం అర్థం చేసుకోవాల‌ని, స్వాతంత్య్రం కంటే అంటరానితం ఎంత భయనాకంగా ఉంటుంటో ఆయన ప్రత్యక్షంగా చూశారని గుర్తు చేశారు. అటువంటి ఆయన జీవిత పాఠాల నుంచి ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం చేయాలనే అఖండ భారతవానికి అమూల్యమైన రాజ్యాంగ సంపద ఇచ్చారని కొనియాడారు. అటువంటి వారికి ఈ రోజు విగ్రహాల‌ను గ్రామంలో నిలిపి నివాళులు అర్పించడం హర్షనీయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో KDCC బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,సర్పంచ్ కళ్యాణం సాగర్,సీనియర్ నాయకులు వేల్పుల రవి,BC నాయకులు అంగడల పూర్ణచంద్రరావు,సొసైటీ అధ్యక్షులు సామినేని లక్ష్మీనారాయణ తదితర గ్రామ ముఖ్య నాయకులు, దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *