Manasu Ichinane Marichipoyinave : ఒక అమ్మాయి ప్రేమ పేరుతో నమ్మించి చివరకు అబ్బాయిని మోసం చేస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి తన నిజమైన ప్రేమ గురించి మోసం చేసిన ప్రియురాలును తలుచుకుంటూ పాట పాడతాడు. ఆ పాట Manasu Ichinane Marichipoyinave Love Failure Song. ఈ పాట 2021లో యూట్యూబ్‌లో వీక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి పాట దుమ్ము రేపుతూనే ఉంది.
మనసు ఇచ్చినావే మరిచిపోయినావే లవ్ సాంగ్ కు లిరిక్స్ & ట్యూన్ రాము కోనేటి అందించారు. ఇక తన అందమైన స్వరంతో మొట్టమొదటిగా లవ్ సాంగ్ పాడి సూపర్ హిట్‌ను అందుకున్నారు సింగర్ మల్లెపాగ రామకృష్ణ. తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఇక కల్యాణ్ కీస్ సంగీతం గుండెల్ని పిండేస్తుందనుకోండి. పాట ఎక్కడా కూడా బోరు కొట్టకుండా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది.
ఈ పాటను ఇప్పటికీ ప్రేమించే యువకులు, ప్రేమ విఫలమైన ప్రేమికులు ప్రతిరోజూ వింటూనే ఉన్నారు. ఈ పాటతో ఎన్నో షార్ట్ వీడియోలు వచ్చాయి. తమ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈ పాటతో స్టేటస్‌లు పెట్టుకుంటున్న కుర్రకారూ ఉన్నారు. ఇంత మంచి పాట రాసిన రాము కోనేటికి, అదే ఎమోషన్‌తో పాటిన రామకృష్ణ వాయిస్‌కు ఫిదా అయ్యారు.
ఈ పాటలో ఒక్కొక పదం గుండెను తాకింది. నిజంగా ప్రేమ విఫలమైన వారు ఆ పదాలకు కన్నీరు పెట్టుకునేలా ఉన్నాయి. చేరువైన చెలియ చెంత లేక ఆఆఆ..చేరుకున్న చెలిమి వీడలేక ఆఆఆ..అంటూ కొనసాగే లిరిక్స్ మనసును తాకాయని చెప్పవచ్చు. ఎన్నో సినిమాల్లో లవ్ ఫెయిల్యూర్ పాటలు వినేఉన్నాం కానీ, ఇలాంటి సాంగ్స్ సాధారణ వ్యక్తులు అందించడం వారి ప్రతిభను మెచ్చుకోక తప్పదు.
Song Name | Manasu Ichinane Marichipoyinave |
Lyrics | Ramu Koninti |
Singer | Mallepaga Ramkrishna |
Music | Kalyan Key’s |
Youtube Video song | Link |
Manasu Ichinane Marichipoyinave lyrics
పల్లవి:నువ్వే నా ప్రేమ అని మనసుని మరచి
నిదేన నా ప్రాణమని ఊపిరి విడిచి ఆ ఆఆ…….
మనసు ఇచ్చినానే మర్చిపోయినవే
ప్రేమనంత ధారపోసి దూరమయ్యేయినవే
కళాలుమోసినవే కథలు చేర్చినవే
నిజమునంత నీరు గార్చి నేరమయ్యినవే..
నువ్వే నా లోకమని నీకు తెలుసుగా
నేను నీ కోసమని అలుసు అయితిగా
నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా..
నా మనసులోని ఊహాలన్ని ఆపుతున్నదే…..2
చరణం1: చినుకు కనులు అన్ని నన్ను చిన్నబోయి చూస్తూ ఉండినయె
తన వెలుగు నువ్వని..
చెరిగిపోని జ్ఞాపకాలు గుండెల్లోనా దాగివుండినయె
తన తలపు నువ్వని..
గోరుతోనే గుండె ఆగినాక
గుడి కట్టి నిన్ను పిలవలేక
నేనే ముగబోతినే నీలో ఆగమైతినే
నాలో భారమై బాధనై మిగిలిపోతినే……2


చరణం2:తళుకుమన్న కలలు అన్ని తనివితీరా దూరమయ్యినాయే
తన నిజాము నువ్వని..
మనసునున్న ఆశలన్నీ ఆవిరై ఆగిపోయినాయె
తన ధ్యాస నువ్వని
చేరువైన చెలియా చెంత లేక
చేదుగున్న చెలిమి విడలేక..ఆ……..
నేనె గాయమైతినే నీలో మాయమైతినే
నన్నే కోరుకున్న కోయిలమ్మ కూత మరిచినే…….2