Murder : వ్యక్తి దారుణ హత్య ! అక్రమ సంబంధ వ్యవహారమేనా? |Chittoor Crime
Murder : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. రూరల్ సీఐ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం నారిగానిపల్లి పంచాయతీ దిగువ లంబం వారి పల్లిలో రాత్రి 12 గంటల సమయంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురం తాలూకా ఓనికిలి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(35) గా గుర్తించామన్నారు. దిగువ లంభం వారి పల్లి లో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో మహిళ భర్త మంజునాధ్ శ్రీనివాస్ నిద్ర పోతుండగా పెద్ద బండరాయిని తలపై వేయడంతో తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్నారు.


గట్టిగా అరుపులు వినపడటంతో స్థానికులు హుటాహుటిన శ్రీనివాస్‌ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల సిఫార్సు మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రీనివాసులు మృతి చెందాడన్నారు. శ్రీనివాస్ మృతదేహానికి శవపంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. సంఘటనను పరిశీలించి కేసు నమోదు చేసినట్టు చౌడేపల్లి సీఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started