Cheating : ఘరానా దొంగ తెలివికి మైండ్ బ్లాక్! | Pakala, chittoor
Cheating : పోలీసు డిపార్ట్ మెంట్లో ఎన్ని ఉద్యోగాల పోస్టులు ఉంటాయో! .. బహుశా వాటిన్నింటినీలో ఆ దొంగ అవతారమెత్తాడు. అత్యంత చాకచక్యంగా మాయమాటలు చెప్పి, సులువుగా డబ్బులు గుంజుతూ పోలీసుల కళ్లు గప్పి తిరుతున్నాడు. ఇలా దాదాపు 4 సంవత్సరాలకు పైగా తన దందా నడిపించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. అసలు విషయంలోకి వెళ్తే..
పోలీసునంటూ ఏకంగా పోలీసువారిని, ప్రభుత్వ ఉద్యోగి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఘరానా దొంగ ను చిత్తూరు జిల్లాలో అరెస్టు చేశారు. జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేనుకుంట పెనుమూరు రోడ్డు క్రాస్ వద్ద అనుమానంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పాకాల పోలీసుస్టేషన్ ఎస్సై రాజశేఖర్ శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.


అనంతరం ఎస్సై రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్ నెల 7వ తేదీన పీతాంబరం రాజశేఖర్‌పై నోటీస్ సర్వ చేశామని తెలిపారు. నెంట్రగుంట క్రాస్ రోడ్డు వద్ద శనివారం మమ్మల్ని చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకుని విచారించినట్టు తెలిపారు. పట్టుకున్న వ్యక్తి పుంగనూరు మండలం, బతలాపురం గ్రామానికి చెందిన పీతాంబరం రాజశేఖర్ (32) గా గుర్తించామన్నారు.
పలు మోసాలకు పాల్పడిన నిందితుడు!
పీతాంబరం రాజశేఖర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని రెవెన్యూ అధికారుల నుండి, ప్రభుత్వ టీచర్లు, వైద్య సిబ్బంది కుటుంబాలతో పాటు తదితరుల నుంచి సుమారు కోటి రూపాయలు దాకా వసూలు చేశాడని తెలిపారు. డా. రాజగోపాల్ అనే వైద్యునికి 2017 సంవత్సరంలో తిరుపతికి వెళుతుండగా నేండ్రగుంట సమీపంలో పెట్రోలు పడుతుండగా సమీపంలో కారు యాక్సిడెంట్ అయ్యిందని డ్రామా ఆడి పరిచయం చేసుకున్నాడని తెలిపారు. టాస్క్ ఫోర్స్ లో సీజ్ చేసిన వాహనాలను తక్కువ ధరకే మీకు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుండి రూ.6 లక్షల 50 వేల వసూలు చేసి మోసం చేశారని పేర్కొన్నారు.


పలు ఉద్యోగాల పేరుతో బురిడీ!
పీతాంబరం రాజశేఖర్ రెడ్ శాండల్ టాస్క్పోర్టు తిరుపతి ఆపరేషన్ ఎస్ఐ అని, తిరుమల, పుత్తూరు ఎస్ఐ అని, పలమనేరు, పంజానీలో ట్రైనింగ్ ఎస్ఐ అని మాజీ హోం మినిస్టర్ చినరాజప్ప పర్సనల్ అసిస్టెంట్ అని, తన భార్య వైజాగ్ మున్సిపల్ కమిషనర్ అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు. వారి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి ఎవరికీ తెలియకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తిరుగుతున్నాడని అన్నారు. ఈ క్రమంలో శనివారం మోసాలకు పాల్పడే నిందితుడును అరెస్టు చేసినట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం