Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడపై పెగాసెస్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెగాసెస్(Pegasus) స్పైవేర్ ను అప్పట్లో చంద్రబాబు కొన్నారని మమతా సంచలన ఆరోపణలు చేశారు. నాలుగేళ్ళ కిందట ఇజ్రాయేల్ ఎన్హెచ్ఓ సంస్థ తమ వద్దకు వచ్చిందని, తమకు పెగాసెస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందని మమతా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థను తిరస్కరించామని చెప్పుకొచ్చారు. పెగాసెస్ స్పైవేర్‌ను విక్రయించడానికి ఆ సంస్థ బెంగాల్ పోలీస్ ను సంప్రదించిందని చెప్పారు. ఇది నాలుగైదేళ్ల కిందట జరిగిన విషయం అని బెనర్జీ(Mamata Banerjee) అన్నారు.
తమ వద్ద పెగాసెస్ ఎన్ఓసీ సంస్థ దానిని అమ్మేందుకు 25 కోట్లు డిమాండ్ చేసిందని, అయితే న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా, రాజకీయంగా దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో దీనిని తిరస్కరించామన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. మరో వైపు తెలుగు దేశం పార్టీ మమతా వ్యాఖ్యాలను తోసిపుచ్చారు. లోకేష్ మమతా వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చారు. తాము పెగాసెస్ కొనుగోలు చేయలేదని, అలా చేస్తే జగన్ సీఎం కాలేడుగా అని తెలిపారు. మొత్తానికి పెగాసెస్‌పై మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతున్నాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!