Bhatti Vikramarka Latest News: కేసీఆర్‌ను విలన్‌తో పోల్చిన భట్టి!
Bhatti Vikramarka Latest News: కేసీఆర్‌ను విలన్‌తో పోల్చిన భట్టి!
ఇందిరమ్మ ఇళ్లను గుంజుకుంటున్నారు
ప్రభుత్వంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్
Bhatti Vikramarka Latest News: Jedcherla: సినిమాల్లో విలన్లు ఊరిమీద పడి పేద, దళితుల భూములు లాక్కున్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన ప్రజల భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) జడ్చెర్ల నియోజకవర్గం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు.
అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉద్దండాపూర్ గ్రామ ప్రజలకు ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టించాలని, భూములు కోల్పోయిన వారికి భూములు, అదే దళిత, గిరిజనులకు రెండింతల భూములు ఇవ్వాలని భట్టి చెప్పారు. అదే విధంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే మార్కెట్ రేటుకు మూడింతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్రామ ప్రజలకు వివరాలు చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని భట్టి ప్రశ్నించారు. ఇదేమని అడిగిన రైతులను పోలీసుల చేత బెదిరించడం, భయభ్రాం తులకు గురిచేయడం అనేది దురదృష్టకరమని అన్నారు. ఉద్దండాపూర్ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని భట్టి అన్నారు. ఉద్దండాపూర్ ప్రజలకు న్యాయం చేయకుండా ఇండ్లు ఖాళీ చేయించడం కుదరదని అన్నారు. అవసరమైతే ఆ ప్రజల కోసం ఆ గ్రామానికి సీఎల్పీ పక్షం అంతా కలిసివస్తాయని భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు.

ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ ఛైర్మన్ కోదండరెడ్డి, తెలంగాణ కిసాన్ సెల్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ ఒబెదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి:తమిళ స్మగ్లర్ అరెస్టు
ఇది చదవండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!
ఇది చదవండి:మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు
ఇది చదవండి:ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను
ఇది చదవండి:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు!
ఇది చదవండి: ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధనలు..ఇక జరిమానానే!
ఇది చదవండి: నాగచైతన్య ఖాతాలో మరో కొత్త లవ్‌స్టోరీ సాంగ్!