Mallu Bhatti fire : పేదలకు ఇచ్చిన జీవోలతో భూములు ఆక్రమణ
మంత్రి పువ్వాడపై మండిపడ్డ మల్లు భట్టి విక్రమార్క
Mallu Bhatti fire : Khammam: పేదల కోసం ఇచ్చిన జీవోలను అడ్డం పెట్టుకుని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూములను రెగ్యులరైజ్ చేయించుకున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల మీద రేపు బూత్ కమిటీ స్థాయి సమావేశం జరగనుందని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిఖ్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కమిటీల అధ్యక్షులు వస్తున్నారని భట్టి విక్రమార్క తెలియజేశారు.
ప్రభుత్వం విఫలం: భట్టి(Mallu Bhatti fire)
ఖమ్మం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. పట్టణంలో సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు, అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సొంత కాంట్రాక్ట్ సంస్థకు, లేదంటే ఆయన మద్దతు దారులకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు కేటాయిస్తున్నారని అన్నారు. మంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. మంత్రి తీరుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. పేదల కోసం ఇచ్చిన జీవో 58,59 ని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యలరైజ్ చేసుకున్నారని భట్టి విమర్శలు చేశారు. వ్యాపారాల కోసం మంత్రి పదవిని అడ్డం పెట్టుకోవడం దుర్మార్గమని భట్టి అన్నారు. అభివృద్ధి పనులను నాసిరకంగా చేస్తూ, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మంత్రి అజయ్ చేస్తున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో సేకరించి విజిలెన్స్‌కు అందిస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపించాలి : భట్టి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేయడంపై ఆయన మండిపడ్డారు.

ఎన్నికల కోసం సమాయత్తం
కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉమ్మడి జిల్లా నాయకులతో రేపు మధ్యాహ్నం సమావేశం ఉంటుందని అన్నారు. ఖమ్మం పట్టణంలో ఉన్న నిరుద్యోగులు, వాళ్ల కోసం త్వరలో భారీ ర్యాలీ చేస్తున్నట్టు ప్రకటించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ , గ్యాస్‌పై ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గారావు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, దీపక్ చౌదరి, బాల గంగాధర్ తిలక్, పుచ్చకాయల వీరభద్రం, మలీద్ వెంకటేశ్వర్లు, నూతి సత్యనారాయణ, ఎర్రబోలు శ్రీను, మొక్క శేఖర్ గౌడ్, బొందయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన మాజీ విలేఖరి అరెస్టు
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు
ఇది చదవండి:శశికళకు అనుమతి ఇవ్వని ఏఐఏడింకే ప్రభుత్వం!
ఇది చదవండి:నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?