Mallu Batti Vikramarka Letest news | సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు దిక్సూచీలా మారారు.

Spread the love

Mallu Batti Vikramarka Letest news | సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు దిక్సూచీలా మారారు.Khammam: ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు దిక్సూచీలా మారారు. ప్ర‌తి నెలా ఏదో ఒక కార్య‌క్ర‌మం చేసుకుంటూ.. పార్టీ కేడ‌ర్ లోనూ, రాష్ట్ర నాయ‌క‌త్వంలోనూ కొత్త ఉత్స‌హాన్ని నింపుతున్నారు. తాజాగా ఆదివారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని 33 జిల్లా కాంగ్రెస్‌, న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుల స‌మావేశం ఏర్పాటుతో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయ‌క‌త్వంలో కొత్త ఉత్స‌హాం నింపిన‌ట్టు తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు శ్రీ‌నివాస‌న్‌, బోస్ రాజు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ స‌హా ప‌లువురు సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

తొలుత జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుల‌తో మాణిక్యం ఠాకూర్‌, భ‌ట్టి విక్ర‌మార్క , ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఖ‌మ్మం కార్పొరేష‌న్ బూత్ స్థాయి నాయ‌కుల‌తో వారు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి దాదాపు 2 వేల మందికి పైగా కాంగ్రెస్ బూత్ స్థాయి నాయ‌కులు హాజ‌ర‌య్యారు. తొలిసారి బూత్ స్థాయి నాయ‌కుల‌కు ఐడీ కార్డులను అందించారు.

Mallu Batti Vikramarka
మాణిక్య‌ ఠాకూర్‌తో చ‌ర్చిస్తున్న భట్టి!

టీఆర్ఎస్, మంత్రి పువ్వాడ పై భ‌ట్టి నిప్పులు!

ఖ‌మ్మం బూత్ స్థాయి నాయ‌కుల స‌మావేశంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీపైనా, స్థానిక మంత్రిపైనా నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక అవినీతి పెరిగింద‌

న్నారు. భావ‌వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు. అంతేకాక ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో అహంకారం, అవినీతి హ‌ద్దుల్లేకుండా పెరిగింద‌ని మ‌ల్లు భ‌ట్టి ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాస్వామ్యం, భావ స్వేచ్ఛ అనేవి న‌గ‌రంలో లేకుండా పోయాయ‌ని విమ‌ర్శించారు. అహంకారానికి, అప్ర‌జాస్వామ్యానికి స‌మాధానం చెప్పే రోజులు త్వ‌ర‌లోనే ఉన్నాయ‌ని భ‌ట్టి అన్నారు.
ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో మంత్రి క‌నుస‌న్న‌ల్లో అవినీతి పెట్రేగింద‌న్నారు. పేద‌ల కోసం ఇచ్చిన జీవోల‌ను అడ్డం పెట్టుకుని ప్ర‌భుత్వ భూముల‌ను రెగ్యుల‌రైజ్ చేసుకున్న స్థానిక మంత్రికి బుద్ధి చెప్పాల‌ని భ‌ట్టి ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.

ప్ర‌శ్నిస్తే పోలీసు కేసులు, నిర్భంధాలు! భట్టీ

రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎవ‌రైనా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నార‌ని, భావ వ్య‌క్తీక‌ర‌ణ చేస్తే అక్ర‌మ నిర్భంధాలు చేస్తున్నార‌ని మ‌ల్లు భ‌ట్టి టిఆర్ఎస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ఖ‌మ్మం న‌గ‌రంలోని ప్ర‌జ‌లు అనేక భావాల‌ను, ప్ర‌జాస్వామ్యానికి అత్యంత విలువ ఇస్తార‌ని అన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ ప‌రిపాలిస్తున్న స‌మ‌యంలోనూ, అన్ని వ‌ర్గాల‌కు, పార్టీల‌కు స్వేచ్ఛ‌గా త‌మ భావాల‌ను వ్య‌క్తం చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింద‌ని భ‌ట్టి అన్నారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అందుకు పూర్తి విరుద్ధంగా నియంతృత్వ వ్య‌వ‌స్థ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు కూడా భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ లేకుండా టిఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తుంద‌న్నారు. అధికార యంత్రంగాన్ని అడ్డు పెట్టుకుని పాల‌న చేస్తున్న కేసీఆర్‌, టిఆర్ఎస్ ప్ర‌భుత్వానికి రానున్న ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతార‌ని అన్నారు.

Mallu Batti Vikramarka
స‌భ‌కు పెద్ద ఎత్తున హాజ‌రైన పార్టీ శ్రేణులు

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ను భ‌య‌పెడితే స‌హించం!

ఖ‌మ్మం జిల్లాలోనే వ్య‌వ‌స్థ‌ను ఏకీకృతం చేసి ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ ప్ర‌తి డివిజ‌న్‌, బూత్ లో ఓట‌ర్ మ్యాపింగ్ తో స‌హా చేసి ప‌ని చేయ‌బోతున్నామ‌న్నారు. ఇక్క‌డ వేదిక‌మీద ఉన్న కాంగ్రెస్ నాయ‌క‌త్వం అంతా క‌లిసి క‌ట్టుగా.. టిఆర్ఎస్ నాయ‌క‌త్వంపై పోరాటం చేస్తామ‌ని భ‌ట్టి అన్నారు. టిఆర్ఎస్ నాయ‌కులు ఏ ఒక్క కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ను భ‌య‌పెట్టినా, బెదిరించినా, స‌హించేది లేద‌ని భ‌ట్టి హెచ్చ‌రించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు మొత్తం రాష్ట్ర నాయ‌క‌త్వం అంతా అండ‌గా ఉంటుంద‌ని భ‌ట్టి చెప్పారు. కార్య‌క‌ర్త‌ల కోసం నాయ‌క‌త్వం ప‌నిచేస్తుంద‌ని భ‌ట్టి ఈ సంద‌ర్భంగా చెప్పారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినాయ‌త్వానికి కానుక ఇవ్వాల‌ని భ‌ట్టీ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

ఇది చ‌ద‌వండి:ప‌దేళ్లు నేనే సీఎంను! ఇది ప‌క్కా!

ఇది చ‌ద‌వండి:మ‌రో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా వ‌స్తున్న ఉప్పెన వైష్ట‌వ్ తేజ్‌

ఇది చ‌ద‌వండి:బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన మాజీ విలేఖ‌రి అరెస్టు

ఇది చ‌ద‌వండి:కార్పొరేట్ సంస్థ‌ల సేవ‌కుడు మోడీ!

ఇది చ‌ద‌వండి:ఇంక్యూబేష‌న్‌ సెంట‌ర్ల‌తో ఉద్యోగావ‌కాశాలు: గ‌వ‌ర్న‌ర్‌

ఇది చ‌ద‌వండి:నిగ్గ‌దీసి అడ‌గ‌టానికి నీకెందుకు భ‌యం?

ఇది చ‌ద‌వండి:10న న‌ల్గొండ‌కు సీఎం కేసీఆర్‌

ఇది చ‌ద‌వండి: స‌మ‌స్యాత్మ‌క గ్రామాల్లో ప‌ర్య‌టించిన ఎస్పీ ర‌వీంద్ర‌బాబు

MP Revanth Reddy is angry over anti-farmer laws | న‌ల్ల‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేఖంగా తెలంగాణ రైతు గ‌ళం వినిపిద్ధాం : రేవంత్ రెడ్డి

MP Revanth Reddy is angry over anti-farmer laws | న‌ల్ల‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేఖంగా తెలంగాణ రైతు గ‌ళం వినిపిద్ధాం : రేవంత్ రెడ్డిHyderabad:  రైతుల ఉద్య‌మానికి Read more

Shock to Congress Party | Komatireddy Rajagopalreddy Join BJP?|తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు షాక్ త‌గ‌ల‌నుందా?

Shock to Congress Party | Komatireddy Rajagopalreddy Join BJP?|తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు షాక్ త‌గ‌ల‌నుందా? Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు మీద షాకులు Read more

Talluri venkatapuram(Khammam): తాళ్లూరు వెంకటాపురం వాసికి డాక్టరేట్

Talluri venkatapuram(Khammam) ఖమ్మం: కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సాంబత్తిని వెంకటేశ్వర్లు కి కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో " Read more

Khammam Suda Chairman: శారీరక దృఢత్వానికి క్రీడలు మేలు చేస్తాయి.

Khammam Suda Chairman ఖమ్మం: క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతో మేలు చెస్తాయని సుడా చైర్మెన్ బచ్చు విజయకుమార్ పేర్కొన్నారు. సమాజంలో మనిషి మానసిక వికాసానికి క్రీడలను Read more

Leave a Comment

Your email address will not be published.