Mallanna Sagar Opening | సిద్దిపేట: కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. తొలుత సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ చేరుకుని అక్కడ పంపు హౌస్‌ను పరిశీలించి మోటార్లు ఆన్ చేస్తారు. 17,600 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.6,000 వేల కోట్ల వ్యయంతో 50 టీఎంసీ(TMC)ల సామర్థ్యంతో మల్లన్న సాగర్‌ను నిర్మించిన విషయం అందరికీ (Mallanna Sagar Opening)తెలిసిందే.
మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగునీటి అవసరాలకు వాడతారు. దీంతో ఆ ప్రాంతంలో 1,500 మంది పోలీసులతో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. మల్లన్న సాగర్ ప్రారంభిస్తోన్న వేల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయికి చేరుకుందని, ఇందులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను నేడు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టకు కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు సహకరించిందని మీరు అనుకుంటున్నారు? అని ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నించారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!