Astrologist Lakshmi Kanth Sharma Vs Teenmar Mallanna | తీన్మార్ మల్లన్న చేతికి మోసపోయిన బాధితుల చిట్టా!
Astrologist : తెలుగు రాష్ట్రాల్లో చిన్న వయస్సులోనే సికింద్రాబాద్ మారుతీ జ్యోతిషాలయం వ్యవస్థాపకులుగా, నాగశాస్త్ర నిపుణు లుగా,సంఖ్యాశాస్త్ర ప్రావీణ్యుడుగా, దత్తాత్రేయ స్వామి ఉపాసకులుగా పేరొందిన లక్ష్మీకాంత్ శర్మ ఇప్పుడు వార్తల్లోనూ, సోషల్‌మీడియాలోనూ ట్రోల్ అవుతున్నారు. అయితే దీనికి కారణం తెలంగాణలో క్యూ న్యూస్ అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్నను జ్యోతిష్యులుగా పేరొందిన లక్ష్మీకాంత్ శర్మ చేతిలో మోసపోయిన బాధితులు ఇటీవల కొద్ది రోజులుగా కలుస్తున్నారు. మా వద్ద వేలకు వేలు డబ్బులు తీసుకొని అన్యాయం చేశారని తీన్మార్ మల్లన్నకు గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు.
అయితే ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై పోరాడుతూ పాలకులను ప్రశ్నిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జ్యోతిషుడు లక్ష్మీకాంత్ శర్మపై కొందరు బాధితులు వచ్చి మోసపోయామని చెప్పడంతో తీన్మార్ మల్లన్న ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ జ్యోతిష్యుడు వెనుక పెద్ద ముఠానే ఉందని, ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని ఈ నెల 20న తన మీడియా ద్వారా తెలియజేశారు. లక్ష్మీకాంత్ శర్మ సంపాదించిన దానిలో కొంత పర్సంటేజ్ మీడియా వారికి, పోలీసు వారికి, మంత్రులకు వెళ్లిపోతుందని తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. గోదానం, కిరణం సరుకులు ఇతర తాయితుల పేరుతో భక్తుల వద్ద డబ్బు వసూలు చేశారనిపేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న లక్ష్మీకాంత్ శర్మ వల్ల మోసపోయిన బాధితులకు ప్రత్యేకంగా ఒక నెంబర్ పెట్టి మోసపోయిన వారి నుండి సమాచారాన్ని రాబడుతున్నారు.
మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారంటున్న భక్తులు!
అయితే తీన్మార్ మల్లన్న జ్యోతిష్యులు లక్ష్మీకాంత్ శర్మపై అసత్య ప్రచారం చేస్తున్నారని శుక్రవారం కొందరు ఆయన భక్తులు ఓ ప్రధాన మీడియాను ఆశ్రయించారు. తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేసిన ట్టు ఓ వార్త ఛానల్లో చెప్పారు. తీన్మార్ మల్లన్న, లక్ష్మీకాంత్ శర్మ ను రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే తన వద్దకు వచ్చిన 400 మంది భక్తుల ఆరోపణలను ప్రసారం చేస్తామని మల్లన్న బెదిరించినట్టు వారు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాటి ద్వారానే పోలీసులకు ఫిర్యాదు చేశామని భక్తులు తెలిపారు. గురువుగారుపై అసత్య ప్రచారాన్ని తట్టుకోలేక పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారని అన్నారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


తీన్మార్ మల్లన్నకు బెదిరింపు కాల్?
ఈ నేపథ్యంలో ఒకరు లక్ష్మీకాంత్ శర్మ పీఏగా పరిచయం చేసుకుంటూ తీన్మార్ మల్లన్న ఆఫీసుకు ఫోన్ చేశారు. లక్ష్మీకాంత్ శర్మపై ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు.? మీకు ఏం కావాలి? మీకు ఏదైనా కావాలంటే కూర్చోని మాట్లాడుకుందామని పీఏగా ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లకు ఫోన్ చేశారు. ఇందుకు మాకేం కావాలి? బాధితులకు న్యాయం కావాలి అంటూ మల్లన్న సమాధానం ఇచ్చారు. డబ్బులు ఆశచూపించి అది ఆపాలని చూస్తున్నారా? అని మల్లన్న ప్రశ్నించారు. బాధితులు తన వద్దకు వచ్చి చెబితేనే లక్ష్మీకాంత్ శర్మ గురించి చెబుతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో పీఏగా ఉన్న వ్యక్తి మీరు రూ.5కోట్లు డిమాండ్ చేశారని తమ వద్ద రికార్డులు ఉన్నాయని మల్లన్నను బెదిరించారు. ఇందుకు మల్లన్న ప్రజలకు సంబంధించిన విషయం అని లక్ష్మీకాంత్ ఒక చీటర్ అని ఎంతో మందిని మోసం చేశారని, అతన్ని అరెస్టు చేయాలని తీన్మార్ మల్లన్న ఫోన్లో సమాధానం ఇచ్చారు. రూ.5 కోట్లు ఇస్తే ప్రచారం ఆపుతారా? అని ఆ వ్యక్తి అడగ్గా.. రూ.5 కోట్లు కాదు.. రూ.5 వేల కోట్లు ఇచ్చినా వదిలే ప్రసక్తే లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు తీన్మార్ మల్లన్న. అయితే ఆగ్రహానికి గురైన అవతలి వ్యక్తి తమ వైపు పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు ఉన్నారని, నువ్వు చాలా చిన్న వ్యక్తివి అని ఫోన్లో హెచ్చరించారు. అయితే మోసం చేసిన వారికి లక్ష్మీకాంత్ శర్మ డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటూ అసలు నిజాలు బయట పెడతామని తీన్మార్ మల్లన్న బదులిచ్చారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started