Makeup: మేక‌ప్ పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకోండిలా!

Makeup: ఖ‌రీదైన మేక‌ప్ సామాగ్రిని వాడుతూ, అలంక‌ర‌ణ‌కు ఎంతో స‌మ‌యం కేటా యించుకున్న‌ప్పుడే అందంగా క‌నిపిస్తామ‌నేది చాలా మంది అభిప్రాయం. వాస్త‌వానికి అవేమీ అవ‌స‌రం లేద‌ట‌. ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపించే చిన్ని చిన్ని పొర‌పాట్లును స‌రిదిద్దుకుంటే చాలు. చ‌మ‌క్కున మెరిసిపోవ‌చ్చు.

Makeup: మేక‌ప్ జాగ్ర‌త్త‌లు!

న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు అంద‌రూ ముఖాన్నే చూస్తార‌నుకుంటాం. దాంతో కేవ‌లం ముఖా న్ని వీలైనంత అందం (Makeup) గా క‌నిపించేలా చేసేందుకు ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటాం కూడా. ఆ క్ర‌మంలో చేతి, కాలి గోళ్ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తాం. ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌నుకుంటాం. కానీ చాలా మంది వాటిని కూడా గ‌మ‌నిస్తారు. షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డానికి చేతులు క‌ల‌పాల్సి రావ‌చ్చు. పెన్నుతో ఏదైనా రాయాల్సి రావ‌చ్చు. అలాంట‌ప్పుడు గోళ్ల‌ల్లో మ‌ట్టి, స‌గం గోళ్ల రంగు మాత్ర‌మే ఉండ‌టం లేదా అవి విరిగిపోయి ఉండ‌టం, లాంటివ‌న్నీ మీరు వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌ను తేలిగ్గా తీసుకుంటార‌నే సంకేతాన్ని అందిస్తాయి. అందుకే వాటి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఉండాలి.

అవాంఛిత రోమాలు!

ముఖంపై అవాంఛిత రోమాలుండ‌టం కూడా స‌హ‌జ అందాన్ని త‌గ్గిస్తుంది. అయితే వాటిని తొల‌గిం చేందుకు లేజ‌ర్ లాంటి చికిత్స‌లు చేయించుకోలేక‌పోవ‌చ్చు. అలాగ‌ని వ‌దిలే యాల‌ని లేదు. బ్లీచింగ్‌ని ఎంచుకోవ‌చ్చు. ఈ రోజుల్లో Bleaching కిట్లు అన్నిచోట్లా దొరుకు తున్నాయి. కాబ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు వాటిదే అవాంఛిత రోమాలు ఎక్కువుగా క‌నిపించ‌ నివ్వ‌కుండా చేయ‌వ‌చ్చు. కొంద‌రు ముందు గ‌మ‌నించు కోకుండా న‌చ్చిన రంగు ఫౌండేష‌న్‌ని ఎంచుకుంటారు. అయితే చ‌ర్మ‌త‌త్వానికి న‌స్పే ఫౌండేష‌న్ ఎంచుకోక‌పోతే, ఆ తేడా ముఖంపై స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

అందుకే కొనేముందు అది మీకు న‌ప్పుతుందా లేదా అన్న‌ది ప‌రీక్షించుకోవాలి. ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కు సంబంధించి బ‌య‌ట‌కు వెళ్తున్న‌ప్పుడు త‌ల జిడ్డుగా ఉన్నా స‌రే అలాగే వెళ్లిపోతుంటారు చాలా మంది. అయితే అన్నిసార్లూ త‌ల‌స్నానం చేసే స‌మ‌యం ఉండ‌క‌ పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు Dry Shampoo లేదా కండిష‌న‌ర్‌ని ఎంచుకోవాలి. దానివ‌ల్ల త‌ల‌లో జిడ్డు త‌గ్గుతుంది.

మేక‌ప్ కిట్‌

మేక‌ప్ తీసివేయ‌డం ఎలా?

మ‌స్కారా, ఆయిల్‌తో కూడిన Makeup, తొల‌గించ‌లేని మ‌ర‌క‌లు, Lipstick, బుగ్గ‌ల‌, పెద‌వుల మేక‌ప్‌, వీట‌న్నింటిని ఒక్క ఫేస్‌వాష్తో తొల‌గించ‌లేము. కానీ స‌గం స‌గం మేక‌ప్‌ని అలానే ముఖంపై ఉంచేస్తే ఎక్నే, మొటిమ‌లు స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మేక‌ప్ రిమూవ‌ర్‌– ఈ రిమూవ‌ర్స్ నీళ్ల‌తో క‌లిసి ఉంటాయి. ఈ Remover బాటిల్‌ని ఓపెన్‌, క్లోజ్ చేయ‌డానికి సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. వాడే ముందు వీటిని బాగా షేక్ చేసి, ఆ జెల్‌ని కాట‌న్ మీద‌కు తీసుకోవాలి. కాట‌న్ స‌హాయంతో ఈ Gel ని ముఖానికంతా ప‌ట్టించి, తిరిగి పొడిగా ఉన్న కాట‌న్ బాల్‌ని తీసుకుని Makeup ని పూర్తిగా తొల‌గించుకోవ‌చ్చు.

మేక‌ప్ వైప్స్‌– దీనికి కాట‌న్‌ని, క్లాత్‌ని వాడాల్సిన అవ‌స‌రం లేదు. దీనిని ముఖంమీద అప్లై చేసి ఏడు నిమిషాల సేపు అలాగే ఉంచి నీటితో కడిగేస్తే చాలు. అంతా క్లియ‌ర‌వుతుంది. ఇది ఎక్కువుగా లోరియ‌ల్ ప్రాడెక్టులో ల‌భిస్తుంది.

బ్యూటీ పార్ల‌ర్‌

రిమూవ‌ర్ అండ్ ఫేస్‌వాష్‌– దీనిని Face Wash లాగే వాడుకోవ‌చ్చు. ఇది Makeup ని తొల‌గించ‌డ‌మే కాకుండా చ‌ర్మాన్ని సున్నితంగా చేస్తుంది. దీంట్లో అధిక నుర‌గ‌నిచ్చే కార‌కాలు ఉంటాయి కాబ‌ట్టి మేక‌ప్‌ని తేలిక‌గా తొల‌గిస్తుంది.

క్లెన్సింగ్ మిల్క్‌– ఈ లోష‌న్ని కాట‌న్ మీద ఉంచి ముఖానికంత‌టికీ అప్లై చేయాలి. అప్లై చేసిన త‌ర్వాత ముఖ‌మంతా డ్రై అయ్యేవ‌ర‌కు అలానే ఉంచి నీటితో క‌డిగేస్తే ముఖం మీద మేక‌ప్ అంతా శుభ్రంగా తొల‌గిపోతుంది. ఇది ఎక్కువుగా హెర్బ‌ల్ ప్రొడ‌క్టుల‌లో ల‌భిస్తుంది.

Share link

Leave a Comment