Make Money in Stock Market : స్టాక్ మార్కెట్ నుండి డ‌బ్బు సంపాదించాల‌నుకునే వారికి చ‌క్క‌టి విశ్లేష‌ణ‌!

Make Money in Stock Market : డ‌బ్బు సంపాదించాల‌ని భావిస్తున్నారా? మీ క‌న్ను స్టాక్ మార్కెట్‌పై ప‌డిందా? అయితే మీరు Stock Marketలో ఇన్వెస్ట్ చేయ‌డానికి ముందు కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి. అవేంటో ఇక్క‌డ చూడండి.

ఈక్విటీ మార్కెట్‌లో Money సంపాదించొచ్చు. కానీ ఇది అంద‌రికీ సాధ్యం కాదు. రాబ‌డి రావాలంటే ముందు రిస్క్ తీసుకోవాలి. క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌హ‌నం వంటివి ఉండాలి. Stock Market లో చాలా డ‌బ్బు సంపాదించొచ్చు. అవును నిజ‌మే. కానీ ఇది అంద‌రికీ సాధ్యం కాదు. షేర్ మార్కెట్‌లో సంపాదించాల‌ని భావిస్తే ముందుగా కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. ఇందులో మొద‌టిది మీకు రిస్క్ తీసుకునే ద‌మ్ముండాలి. ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువుగా ఉంటుంది. వేగంగానే న‌ష్టాలు రావొచ్చు. రాంగ్ స్టాక్‌ను ఎంచుకుంటే పెట్టిన డ‌బ్బు పోగొట్టుకోక త‌ప్ప‌దు.

Equity Market లో ఇన్వెస్ట్ చేసే వారు డ‌బ్బు (Make Money) సంపాదించాలంటే రెండు విష‌యాల‌ను క‌చ్చితంగా ఫాలో కావాలి. ఒక‌టేమో క‌రెక్ట్ స్టాక్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఏ టైమ్‌కు ఆ స్టాక్ నుంచి బ‌య‌ట‌కు రావాలి. అంటే ఏ స్టాక్ కొనాలి? కొన్న స్టాక్‌ను మ‌ళ్లీ ఎప్పుడు విక్రయించాలి? అనే రెండు అంశాలు తెలిసి ఉండాలి.

స్టాక్ మార్కెట్‌

ఇన్ఫోసిస్ టెక్నాల‌జీస్‌, టీసీఎస్‌, ఐష‌ర్ మోటార్స్‌, రిలాక్సో ఫుట్‌వేర్‌, అవంతి ఫీడ్స్ వంటి ప‌లు స్టాక్స్ గ‌త 10-15 ఏళ్ల‌లో ఇన్వెస్ట‌ర్ల‌ను మిలియ‌నీర్ల‌ను చేశాయి. స‌రైన స్టాక్‌ను ఎంచుకోవ‌డానికి మీరు ఆర్థిక మేధావి కావాల్సిన అవ‌స‌రం లేదు. పైనాన్షియ‌ల్ స్టేట్‌మెంట్ అర్థం చేసుకోవ‌డంతో పాటు ఇత‌ర అంశాల‌పై కొంత అవ‌గాహ‌న ఉంటే స‌రిపోతుంది.

Make Money in Stock Market: మ‌రి క‌రెక్ట్ స్టాక్ ఎలా ఎంచుకోవాలి?

కంపెనీ స్థిర‌మైన ఆదాయ వృద్ధిని న‌మోదు చేస్తుండాలి. అదే కొత్త కంపెనీ అయితే, దీనికి క్యాష్ ఫ్లో ఎక్కువుగా ఉండాలి. మంచి ఆదాయాన్ని అర్జించే సామ‌ర్థ్యం ఉండాలి. Company Income వివిధ మార్గాల నుంచి వ‌స్తుండాలి. అంటే కార్య‌క‌లాపాల డైవ‌ర్షికేష‌న్ క‌నిపించాలి. కంపెనీ వ‌ద్ద స‌రిప‌డినంత క్యాష్ ఫ్లో ఉండి, కొత్త‌గా మూల‌ధ‌నాన్ని స‌మీక‌రించ‌గ‌లిగే స‌త్తా ఉండాలి. ఎక్కువ రుణ భారం ఉన్న కంపెనీల జోలికి వెళ్లొద్దు.

ఆయా రంగాల్లో, వారి వ్యాపారాల్లో లీడ‌ర్లుగా ఉన్న కంపెనీల‌ను ఎంచుకోండి. కొత్త కంపెనీలు అయితే వారి ప్రొడ‌క్టుల‌ను గ‌మ‌నించండి. అవి ఇన్నోవేష‌న్‌తో కొత్త ప్రొడ‌క్టుల‌ను లాంచ్ చేస్తూ ఉండాలి. ప్ర‌భుత్వాల‌పై ఆదాయం కోసం ఎక్కువుగా ఆధార‌ప‌డే కంపెనీల‌ను లెక్క‌లోకి తీసుకోవ‌ద్దు.

Make Money in Stock Market: చేయ‌కూడ‌ని ప‌నులు ఇవే!

కేవ‌లం మీడియాలో బాగా పాపుల‌ర్ అయిన కంపెనీ స్టాక్‌ను కొనొద్దు. దూరంగా ఉండండి. దిగ్గ‌జ ఇన్వెస్ట‌ర్లు, పాపుల‌ర్ సెల‌బ్రెటీ ఇన్వెస్ట‌ర్ల‌ను గుడ్డిగా అనుక‌రించొద్దు. వారి రిస్క్‌, రిట‌ర్న్ ప్రొఫైల్ భిన్నంగా ఉంటుంది. కొన్ని త్రైమాసికాలుగా స్టాక్ స‌రైన ప‌నితీరు క‌న‌బ‌ర్చ‌డం లేద‌ని మీ ఇన్వెస్ట్‌మెంట్ థీసిస్‌ను మార్చుకోవ‌ద్దు. కంపెనీ ఫండ‌మెంటల్స్ క్షీణిస్తూ ఉంటే, ఆ స్టాక్‌ను అలాగే అట్టిపెట్టుకోవ‌ద్దు.

క‌రెన్సీ

Make Money in Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయ‌డం అంత సుల‌భం కాదు. క్ర‌మ శిక్ష‌ణ‌, స‌హ‌నం కావాలి. మీరు ఒక మంచి స్టాక్‌ను ఎంచుకున్న త‌ర్వాత స్వ‌ల్ప‌కాలిక ఒడిదుడుకుల‌కు భ‌య‌ప‌డొద్దు. కంపెనీ ఫండ‌మెంట‌ల్స్ ప‌టిష్టంగా ఉండి, మార్కెట్ వాటా పెంచుకుంటూ వెళ్తొన్న కంపెనీల‌పై న‌మ్మ‌కంగా ఉండొచ్చు. సామ‌ర్థ్యం ఉన్న Stock స‌త్తా తెలియాలంటే కొన్ని సంద‌ర్భాల్లో సంవ‌త్స‌రాలు కూడా ప‌ట్టొచ్చు. దీర్ఘ‌కాలంలో ఈక్విటీ మార్కెట్ క‌న్నా ఎక్కువ రాబ‌డి అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధ‌నాలు మ‌రేవి లేవ‌ని విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Share link

Leave a Comment