Makara Rasi 2023: ఈ నూతన సంవత్సరం 2023 లో 12 రాశుల వారు తమ జీవిత ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలని అనుకుం టుంటారు. కానీ అది ఎప్పుడూ జరగదని Astrology పండితులు చెబుతున్నారు. మనం వేసుకున్న ప్లాన్ పరంగా ఏదీ జరగదని, ప్రకృతి చెప్పిన విధంగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది. తప్ప మనం అనుకున్నది ఏదీ జరగదు. కానీ ప్రకృతి చెప్పే సూచనలను ఆస్ట్రాలజీ ద్వారా ముందే తెలుసుకుని మనం జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.
ఈ 2023 సంవత్సరంలో కూడా నాలుగు రాశుల వారికి బాగుంటుంది, ఆరు రాశుల వారికి బాగుండదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని రాశులు బాగుంటే కొన్ని రాశులు బాగుండవు అని అంటున్నారు. New Year అనేది హిందువుల లెక్కల ప్రకారం ఉగాది నుండి ప్రారంభమ వుతుంది, కానీ ఆస్ట్రాలజీ ప్రకారం జనవరి 26, 2023 న గ్రహాలు మార్పు జరుగుతాయి కాబట్టి అప్పటి నుంచి రాశి ఫలాల ప్రభావం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. కాబట్టి మకర రాశి (Makara Rasi) 2023 సంవత్సరంలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Makara Rasi 2023: వృషభ రాశి ఫలాలు
మకరం అనగా ముసలి. ముసలి నీటిలో ఉంటేనే క్షేమంగా ఉంటుంది. కానీ బయటకు వస్తే కుక్కలు కూడా మొసలిని పట్టేస్తాయి. అదే నీళ్లలో ఉంటే ఏనుగు సైతం మొసలికి భయపడా ల్సిందే. కాబట్టి ఈ మకర రాశి వారికి ఏడు సంవత్సరాల నుండి శని వెంటాడు తోందని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అయిపోయిందని, ఇంకా రెండు సంవత్సరాలు శని ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పెళ్లైన అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంట. వారికి శని కాళ్ల మీదకు వస్తాదంట.
శని ఎప్పుడైనా తల మీద, గుండెల మీద, కాళ్ల మీదకు వస్తాడని ఆస్ట్రాలజీ జ్యోతిషులు చెబుతున్నారు. ఇప్పుడు మకరరాశి వారికి కాళ్ల మీదకు వచ్చిందని, వీరు ఎక్కువుగా గొడవలతో ఫ్యామిలీ కోర్టులు చుట్టూ తిరుతుంటారని అంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వివాహ జీవితంలో గొడవలు కొనసాగు తున్నాయంట. మకర రాశి వారు భయపడాల్సిన అవసరం లేదని కొన్ని గ్రహ స్థితుల వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు. కాబట్టి ఈ ఏడాది 2023లో మకర రాశి వారు వివాహం అయిన ఆడవాళ్లు కేవలం మీ ఇష్టం అండీ..అనే మాట ఒక్కటి అనాలంట. ఎలాంటి ఎదురు సమాధానాలు చెప్పవద్దని సూచిస్తున్నారు.
ఇక Makara Rasi వారు వ్యాపారాలు జాగ్రత్తగా చేయాలని, కొత్తవి ప్రారంభించ వద్దని జ్యోతిషులు చెబుతున్నారు. వీరికి ఎవరి వల్లనైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందట. కాబట్టి మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి వాదోపవాదాలకు వెళ్లవద్దని ఇంకా రెండు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. Makara Rasi వారు ఈ ఏడాది (2023) తీర్థ యాత్రలు చేయమంటున్నారు. గుడులను దర్శించమంటున్నారు. ప్రతి శనివారం శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి అభిషేకం చేయాలని సూచిస్తున్నారు.