Majjiga: మనలో చాలా మందికి పెరుగు అన్నా, మజ్జిక అన్నా, ఆఖరికి పాలు అన్నా చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడూ వాటిని తినరు. వాటికి దూరంగా ఉంటారు. కానీ మన పల్లెటూర్లలో దొరికే అతి చౌవకైన, బలమైన ఆహార పదార్థాలు ఇవే. అయితే ఇప్పుడు మజ్జిగ తాగితే శరీరంలో అద్భుతమైన మార్పులు కలుగుతాయని మీకు తెలుసా. రోజూ ఉదయం coffe, Tea లు తాగే బదులు ఒక గ్లాసు మజ్జిక తాగితే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
మనలో చాలా మందికి నిద్రలేవంగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది కదా. కానీ మన భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్రలేవగానే వెంటనే ఒక గ్లాసు మజ్జిక తాగే అలవాటు చాలా మందికి ఉంది. ఇక మన తాతలు, తండ్రులు పూర్వీకులు మజ్జిక లేకుండా ఉండలేరు. అంతెందుకు మన ఇంటిలోనే మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు మజ్జిగ ప్రతిరోజూ తాగాల్సిందే. మజ్జిగ (butter milk) ను ఎక్కువగా ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి తాగుతారు.
Majjiga తో ఆరోగ్యం
మజ్జిగను పెరుగు, కొన్ని masala pops దినుసులతో రుచికరంగా తయారు చేసుకుంటారు. కరివేపాకు, ఆవాలు, అల్లం, జీలకర్ర వంటి పోపులతో బట్టర్ మిల్క్ తయారు చేసి తీసుకుంటారు.పెరుగులో ప్రోబయోటిక్ వంటివి ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది. క్యాలరీలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనం ఉంటుంది.
రోజూ ఉదయం పరగడుపున మజ్జిగ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మజ్జిగ ప్రతిరో్జూ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అదే విధంగా acidic రిప్లైక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది. ఈ బటర్ మిల్క్ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా చల్లగా ఉంటుంది, అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. దీని వల్ల పొట్ట చల్లగా ఉంటుంది.
ఔషధ గుణాలు మెండు
Majjiga లో కరివేపాకు, జీలకర్ర, pepper powder వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు. మనం ఎప్పుడైనా ఎక్కువుగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా అనిపించినప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగితే మంచిది. ఇది జీర్ణశక్తిని పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది. డీహైడ్రేషన్‌తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ, ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. ఇలా తాగితే వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు.
ఇంకా మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో మూడు సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల cholesterol వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. Majjiga ను తాడం వల్ల బిపి తగ్గించుకోవచ్చు.
- మజ్జిగలో జీలకర్ర, ఇంగువ, సైంధవ లవణాలు అన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
- మజ్జిగ పైల్స్ వ్యాధితో బాధపడేవారు తాగితే ప్రయోజనం ఉంటుంది. అర్శమొలలతో బాధపడే వారు కొంచెం నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగితే మల విసర్జన తరువాత మలద్వారంతో వచ్చే మంట తగ్గుతుంది.
- రక్తస్రావం అర్శమొలలతో బాధపడే వారు వెన్న తొలగించిన Majjiga బాగా పనిచేస్తాయి.
- మూత్రంలో మంటతో బాధపడే వారు మజ్జిగలో శుద్ధి చేసిన గంధకాన్ని కలిపి తాగాలి.
- చర్మంపైన మంటలగా ఉంటే మజ్జిగలో వాష్‌క్లాత్‌ని ముంచి ఒళ్లు తుడుచుకుంటే ఉపశమనం లభిస్తుంది.