Uri Siksha: దేశంలోనే తొలిసారి మ‌హిళ‌కు ఉరిశిక్ష

0
43

Uri Siksha: Utthar Pradesh : స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత భార‌త‌దేశంలో ఓ మ‌హిళ‌ను తొలిసారి ఉరికంభం ఎక్కించేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జైలు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. ఏడుగురు కుటుంబ స‌భ్యుల‌ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చిన ఓ మ‌హిళ‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని మ‌థుర కోర్టు జైలు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో త‌లారి ప‌వ‌న్ జ‌ల్ల‌ద్ ఉరితాడును సిద్ధం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కేసువివ‌రాలు ప‌రిశీలిస్తే.. మథుర‌కు చెందిన ష‌బ్న‌మ్ అనే మ‌హిళ స్థానికంగా నివ‌సిస్తోంది. ఈ క్ర‌మంలోనే స‌లీం అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్పాడి అనంత‌రం శారీర‌క సంబంధానికి దారితీసింది. పెళ్లికి ముందే ష‌బ్న‌మ్ దారిత‌ప్ప‌డంతో కుటుంబ స‌భ్యులు గ‌ట్టిగా మంద‌లించారు.

మ‌రోసారి అత‌నితో తిర‌గొద్ద‌ని ఆంక్ష‌లు విధించారు. అయిన‌ప్ప‌టికీ తీరు మార్చుకోని ష‌బ్న‌మ్ స‌లీంను వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. దీని కొర‌కు కుటుంబ స‌భ్యుల అనుమ‌తిని కోరింది. దీనికి వారు నిరాక‌రించ‌డంతో పాటు ష‌బ్న‌మ్‌ను గృమ నిర్భంధం చేశారు. దీంతో కుటుంబ స‌భ్యుల‌పై కక్ష పెంచుకుంది. ష‌బ్న‌మ్ ప్రియుడు స‌లీంతో క‌లిసి హ‌త‌మార్చాల‌ని ప‌థ‌కం ప‌న్నింది. అనుకున్న‌దే త‌డువుగా 2008 ఏప్రిల్ 14న అర్థ‌రాత్రి స‌లీంతో క‌లిసి ఏడుగురు కుటుంబ స‌భ్యుల‌ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చింది. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.
ఐదు రోజుల అనంత‌రం నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దర్నీ జైలుకు త‌ర‌లించే క్ర‌మంలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అప్ప‌టికే ష‌బ్న‌మ్ ఏడువారాల గ‌ర్భ‌వ‌తి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు త‌ర‌లించారు. పోలీసుల విచార‌ణ‌లో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కుటుంబ స‌భ్యుల‌ను హ‌త‌మార్చేలా స‌లీంను ష‌బ్న‌మే ప్రోత్న‌హించింద‌ని తేలింది. అంతేకాకుండా ఆమె ఎంఏ ఇంగ్లీష్‌, జాగ్ర‌ఫీలో ప‌ట్టాపొందారు కూడా. కేసుపై పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపిన మ‌థుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్ద‌రికీ మ‌ర‌ణ శిక్ష‌ను విధిస్తూ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది.

దీనిని స‌వాలు చేస్తూ దోషులు అల‌హాబాద్ హైకోర్టును ఆశ్ర‌యించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థించి రివ్యూ పిటిష‌న్ల‌ను కొట్టివేసింది. దీంతో స‌లీం, ష‌బ్న‌మ్ 2015లో సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంత‌రం చివ‌రి అవ‌కాశంగా అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ముందు క్ష‌మాభిక్ష‌ను అభ్య‌ర్థించ‌గా, ఆయ‌న దానికి నిరాక‌రించారు. దీంతో తాజాగా మథుర కోర్టు దోషుల‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని జైలు అధికారుల‌ను ఆదేశించింది. త్వ‌ర‌లోనే తేదీల‌ను ఖ‌రారు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా బ్రిటిష్ ఇండియాలో చివ‌రి సారిగా 1870 లో ఓ మ‌హిళ‌కు ఉరిశిక్ష‌ను అమ‌లు చేశారు. మ‌ళ్లీ దాదాపు 150 ఏళ్ల త‌ర్వాత మ‌హిళ‌ను ఉరితీయ‌డం గ‌మనార్హం.

Latest Post  Sc St Reservation: నేడే ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌పై కీల‌క తీర్పు

ఇది చ‌ద‌వండి: వారికి మ‌రో అవ‌కాశం ఇచ్చిన ఎస్ఈసీ

ఇది చ‌ద‌వండి:కొత్త స్ట్రెయిన్ల‌తో ముప్పు..అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం

ఇది చ‌ద‌వండి:హ‌త్య‌లు వెనుక టిఆర్ఎస్ పాత్ర: ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి

ఇది చ‌ద‌వండి:మ‌నిషి మాంసం తినే తెగ గురించి తెలుసా?

ఇది చ‌ద‌వండి:జీతాల్లేవు..భ‌ద్ర‌త లేదు!

ఇది చ‌ద‌వండి:తెలంగాణ కోడ‌ల‌ను నేను.. విమ‌ర్శ‌కుల‌కు ష‌ర్మిలా స‌మాధానం!

ఇది చ‌ద‌వండి:పెద్ద‌ప‌ల్లిలో హైకోర్టు న్యాయ‌వాది దంపతుల దారుణ హ‌త్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here