Mahila Bandhu Celebrations

Mahila Bandhu Celebrations: మ‌హిళా బంధు సంబురాల‌కు గులాబీ ద‌ళం రెడీ అవ్వండి!

Telangana

Mahila Bandhu Celebrations | తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులు, ఐటీ శాఖా మంత్రి క‌ల్వ‌కుంట్ర తార‌క రామారావు ఆదేశాల మేర‌కు మ‌హిళా బంధు సంబురాలు మూడ్రోజుల పాటు ఘ‌నంగా జ‌ర‌గాల‌ని జనగామ జిల్లా పరిషత్ ఛైర్మ‌న్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్ర‌వారం జనగామ జిల్లాలోని (యశ్వంతపుర్) వద్ద TRS పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ నెల 6, 7, 8 తేదీలలో మహిళా బంధు(Mahila Bandhu Celebrations) కెసీఆర్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అరుదైన, అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ పథకాల అమలు నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలు ఘనంగా చేపట్టాలని తెలిపారు.
6వ తేదీన సంబురాల ప్రారంభం సందర్భంగా కెసిఆర్ కు రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినీలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం చేయాలన్నారు.

అలాగే, కెసిఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయాలన్నారు. 7వ తేదీన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా పేదింటి బిడ్డల పెండ్లిండ్లు చేసిన కల్యాణలక్ష్మి, 11 లక్షలు దాటిన కెసిఆర్ కిట్ లు వంటి పలు మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా వాళ్ళ ఇంటి వద్దకెళ్లి కలిసి అభినందించి, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవాలని చెప్పారు.

8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబురాలు నిర్వహించాలని చెప్పారు. గతంలో లాగే రైతుబంధు వారోత్సవాలు, కెసిఆర్ జన్మదిన వేడుకల మాదిరిగా తాజా కార్యక్రమాలను విజయవంతంగా, ఘనంగా నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్‌ 40 ఏండ్ల తన రాజకీయ అనుభవంతో ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో, ఈ సారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్రంలోని మహిళా సంక్షేమంతో అనుసంధానించి ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు.

ప్రభుత్వ దవాఖానాల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయ‌ని, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామ‌ని, వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నామ‌ని, మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామ‌న్నారు. బాలికా, మహిళా విద్య కోసం ప్రత్యేక స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేశామ‌న్నారు. పిల్లలకు 70 లక్షల హెల్త్ హై జెనిక్ కిట్లను అందించామ‌న్నారు.

ప్ర‌భుత్వ పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రజలకు వివరించాలని సంపత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపిపిలు, మండల అధ్యక్షులు, మహిళా విభాగం అధ్యక్షురాలు, నాయకురాలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యుత్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *