maharashtra news మహారాష్ట్ర: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది రోగులు మృతి చెందగా, మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలో అహ్మద్‌నగర్‌లోని కోవిడ్ ఆస్పత్రి ఐసీయులో శనివారం చోటు చేసుకున్న ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐసీయూ వార్డులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. మంటల ధాటికి బయటకు రాలేక చిక్కుకుపోయిన ఆరుగురు కరోనా పేషెంట్లు సజీవదహనమయ్యారు. ప్రమాదం సమయంలో కరోనా వార్డులో 17 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మిగిలిన 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది తో సహా వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా (maharashtra news)మారింది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!